కేంద్రం గుడ్ న్యూస్.. బుక్ చేసుకున్న 2 రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ..

Date:


India

oi-Bomma Shivakumar

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ కొరత కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్స్, హాస్టళ్లు మూత పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుకింగ్‌ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.

వంట గ్యాస్‌ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుకింగ్‌ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ ఉంటుందని స్పష్టం చేసింది. దేశ ప్రజల అవసరాల దృష్ట్యా LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు పేర్కొంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో భారీగా గ్యాస్ కొరత ఏర్పడుతుందని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. హార్మూజ్ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. హార్మూజ్ జల సంధి నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించినట్లు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు ముడి చమురు, గ్యాస్ కొరత దృష్ట్యా దేశంలో నెలకున్న పరిస్థితులపై కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ కీలక విషయాలను వెల్లడించారు. భారత్ కు ముడి చమురు సరఫరా జరుగుతోందని తెలిపారు. భారత్ ప్రస్తుతం రోజూ దాదాపు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తుందని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా ఇతర మార్గాల ద్వారా చమురు సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సూచనలు చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related