India
-Bomma Shivakumar
కేంద్ర
హోం
మంత్రి
అమిత్
షా
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
కేరళ
శబరిమల
ఆలయంలో
బంగారం
చోరీ
కేసులో
నిందితులను
అక్కడి
ఎల్డీఎఫ్
ప్రభుత్వం
దాచిపెడుతోందని
ఆరోపించారు.
పినరయి
విజయన్
ముఖ్యమంత్రిగా
ఉన్నంతకాలం
ఈ
కేసు
ముందుకు
సాగదని
అన్నారు.
ఈ
కేసును
స్వతంత్ర
ప్రాతిపదిక
కలిగిన
సంస్థకు
అందించాలని
అన్నారు.
ఈ
మేరకు
నూతనంగా
ఎన్నికైన
బీజేపీ
స్థానిక
సంస్థల
ప్రజాప్రతినిధులతో
ఏర్పాటుచేసిన
కార్యక్రమంలో
అమిత్
షా
ప్రసంగించారు.
కేరళలో
2026
అసెంబ్లీ
ఎన్నికల
నేపథ్యంలో
కేంద్ర
హోంమంత్రి
అమిత్
షా
ప్రచారాన్ని
వేగవంతం
చేశారు.
కొచ్చిలో
జనవరి
8న
జరిగిన
పార్టీ
‘శక్తి
కేంద్ర’
సమావేశంలో
ఆయన
పినరయి
విజయన్
నేతృత్వంలోని
ప్రభుత్వమే
లక్ష్యంగా
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
శబరిమల
ఆలయంలో
బంగారం
చోరీ,
రాష్ట్రంలో
పెరుగుతున్న
రాజకీయ
హింసపై
ఆయన
తీవ్ర
విమర్శలు
గుప్పించారు.
కేరళ
శబరిమల
ఆలయంలో
బంగారం
చోరీ
కేసులో
నిందితులను
అక్కడి
ఎల్డీఎఫ్
ప్రభుత్వం
దాచిపెడుతోందని
ఆరోపించారు.
అమిత్
షా
మాట్లాడుతూ..
శబరిమల
ఆలయ
హుండీ
నుండి
31.5
కిలోల
బంగారం
చోరీకి
గురైంది.
ఇంతవరకు
కేరళ
ప్రభుత్వం
నిందితులపై
ఎటువంటి
చర్యలూ
తీసుకోలేదు”
అని
ఆరోపించారు.
రాష్ట్రంలో
రాజకీయ
హింస
పెరిగిందని
మండిపడ్డారు.
“2023లో
11
మంది
బీజేపీ-ఆరెస్సెస్
కార్యకర్తలను
పీఎఫ్‌ఐ
కార్యకర్తలు
దారుణంగా
హత్య
చేశారు.
ఇలాంటి
సంస్థలపై
రాష్ట్ర
ప్రభుత్వం
కఠిన
చర్యలు
తీసుకోవాలి,
కానీ
వారు
ఆ
పని
చేయడం
లేదు”
అని
ఆయన
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
ప్రధాని
మోదీ
నేతృత్వంలోని
ఎన్డీఏతోనే
కేరళలో
అభివృద్ధి
సాధ్యం
అని
అమిత్
షా
పేర్కొన్నారు.
కేరళ
ప్రజల్లో
బీజేపీకి
మద్దతు
పెరుగుతోందని
తెలిపారు.
ఏటేటా
కేరళలో
బీజేపీకి
ఓటింగ్
శాతం
పెరుగుతోందని
పేర్కొన్నారు.
2026
లో
కేరళలో
విజయం
సాధించి
తీరుతామని
ధీమా
వ్యక్తం
చేశారు.
వచ్చే
ఎన్నికల్లో
కచ్చితంగా
బీజేపీ
ముఖ్యమంత్రి
ఎన్నికవుతారని
ఆశాభావం
వ్యక్తం
చేశారు.


