కేసీఆర్-జగన్ పై గోరంట్ల షాకింగ్ కామెంట్స్-పవన్ ను రెచ్చగొడుతున్న వైసీపీ..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఏపీ
విభజన
జరిగి
దశాబ్దం
దాటిపోయినా
ఇంకా
విభజన
సమస్యలు
పెండింగ్
లోనే
ఉన్నాయంటే
అందుకు
జగన్,
కేసీఆరే
కారణమని
టీడీపీ
నేత
గోరంట్ల
బుచ్చయ్య
చౌదరి
ఆరోపించారు.
కేసీఆర్
తన
కంటే
జూనియర్
అని,
జగన్

డిక్టేటర్
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
చంద్రబాబు
విజనరీ
నాయకత్వాన్ని
పవన్
కళ్యాణ్
అర్దం
చేసుకుంటుంటే,
వైసీపీ
మాత్రం
ఆయన్ను
సినీ
ఇండస్ట్రీలో
పెద్దల
ద్వారా
ఆయన్ను
రెచ్చగొట్టాలని
చూస్తోందన్నారు.
అలాగే
రాష్ట్రంలో
ఎన్ని
ఇబ్బందులు
ఎదురైనా
కూటమి
సర్కార్
కొనసాగుతుందన్నారు.

గత
వైసీపీ
ప్రభుత్వంలో
రాష్ట్ర
అభివృద్ది
జరగలేదని,
సాగునీటి
ప్రాజెక్టులు,
ఉద్యోగాలు,
పరిశ్రమల
విషయంలో
ప్రజల్ని
పూర్తిగా
నిరాశపర్చారని
గోరంట్ల
బుచ్చయ్య
ఆరోపించారు.
కానీ
ఇప్పుడు
జగన్

నియంతలా
వ్యవహరిస్తున్నారని
విమర్శించారు.
దిగువరాష్ట్రంగా
గోదావరిపై
బనకచర్ల
ప్రాజెక్టును
నిర్మించుకుంటే
తప్పేంటని
ఆయన
ప్రశ్నించారు.
సాగునీటి
ప్రాజెక్టులపై
కేసీఆర్
అనవసర
రాద్దాంతం
చేస్తున్నారని
ఆయన
మండిపడ్డారు.

కేసీఆర్,
జగన్
ఇద్దరూ
గతంలో
విభజన
సమస్యలు
పరిష్కారం
కాకుండా
అడ్డుకున్నారని,
తాను
తెలుగు
వర్శిటీ
సమస్యకు
పరిష్కారం
చూపించానని
గోరంట్ల
గుర్తుచేసుకున్నారు.
విభజన
సమస్యలకు
ముగింపు
పలకాలంటే
చిత్తశుద్ధి
అవసరం
అన్నారు.
గత
వైసీపీ
హయాంలో
కొడాలి
నాని,
వల్లభనేని
వంశీ
వంటి
నేతలకు
నోరు
అదుపులో
పెట్టుకోవాలని
గతంలోనే
తాను
చెప్పానని,
కానీ
వినకపోవడం
వల్లే
వాటి
పరిణామాల్ని
ఇప్పుడు
అనుభవిస్తున్నారన్నారు.
తాను
మాత్రం
రాష్ట్ర
ప్రయోజనాల
కోసం
నిక్కచ్చిగా
మాట్లాడుతూనే
ఉంటానన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related