కొంప ముంచుతున్న బంగారం ధరలు

Date:

Business

oi-Chandrasekhar Rao

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైపైకి ఎగబాకాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,63,640 రూపాయలకు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,50,000 గా ఉంది. జనవరి నెలలో బంగారం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. 10 గ్రాముల ధర రూ. 1,80,000కి పైగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా రూ. 4,20,000 రికార్డు స్థాయిని చేరుకుంది.

ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభం నుంచీ ధరలు తగ్గుతూనే వస్తోన్నాయి. మంగళవారం నాడు హోలీ హాలిడేను మినహాయిస్తే సోమ నుండి శుక్రవారం వరకూ వీటి ధరలు నేలచూపులు చూశాయి. ఇప్పుడు వీటన్నింటినీ కవర్ చేసేలా ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం నాటితో పోల్చుకుంటే నేడు బంగారం ధరల్లో 2,800 రూపాయల వరకు తేడా కనిపించింది. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,150, 24 క్యారెట్లు రూ.1,63,800గా నమోదైంది.. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,50,050, 24 క్యారెట్లు రూ. 1,63,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,50,000, 24 క్యారెట్ల బంగారం రూ. 1,63,640గా నమోదయ్యాయి. యూఎస్ స్పాట్ గోల్డ్ 1.15 శాతం పెరిగి ఔన్సుకు 5,181.30 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఈ వారం సుమారు మూడు శాతం నష్టపోయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,418, 22 క్యారెట్లు – రూ. 15,050, 18 క్యారెట్లు – రూ. 13,070

ముంబై..

24 క్యారెట్లు – రూ. 16,364, 22 క్యారెట్లు- రూ. 15,000, 18 క్యారెట్లు – రూ. 12,273

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 16,364, 22 క్యారెట్లు- రూ. 15,000, 18 క్యారెట్లు – రూ. 12,273

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 16,364, 22 క్యారెట్లు- రూ. 15,000, 18 క్యారెట్లు – రూ. 12,273

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 16,364, 22 క్యారెట్లు- రూ. 15,000, 18 క్యారెట్లు – రూ. 12,273

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 16,364, 22 క్యారెట్లు- రూ. 15,000, 18 క్యారెట్లు – రూ. 12,273

Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related