కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. పాత కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను జోడించే ప్రక్రియ సైతం నిరంతరం కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకా రేషన్ కార్డులు రానివారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం సామాన్యుల ఇబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు జరగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్య ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు, కుటుంబాలుగా వేరుపడిన వారు, పిల్లలు పుట్టిన వారు చాలామంది చాలాకాలంగా రేషన్ ప్రయోజనాలకు దూరమై ఇబ్బంది పడుతున్నారు.

అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ

పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును లింకు పెట్టడంతో కొందరు సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా పొందలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించి మంజూరు ప్రక్రియను ప్రారంభించింది.

భారీగా పెరిగిన రేషన్ కార్డులు, లభ్దిదారులు

దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుదారుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2026 జనవరి నాటికి ఒక కోటి నాలుగు లక్షల 35 వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదికి చేరినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య దాదాపు మూడు కోట్ల 36 లక్షలకు చేరినట్లు అధికారులు తెలిపారు.

ఒక్క సంవత్సరంలోనే దాదాపు 14న్నర లక్షల రేషన్ కార్డులు

గత ఏడాది కాలంలోనే ఏకంగా 14.40 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇచ్చిన కార్డుల ద్వారా 54.49 లక్షల మంది అదనంగా రేషన్ తీసుకుంటున్నారు. ఇక రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడవలసిన అవసరం లేదని నిరంతరాయంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుందని అవసరమైనవారు మీసేవ ద్వారా అప్లై చేసుకోవచ్చునని చెబుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Jude Law’s Ex Addresses Chappell Roan Incident

She shares a producer with Olivia RodrigoChappell isn’t Dan’s...

Xbox lines up a Partner Preview showcase for March 26

Microsoft has locked in its second games showcase of...

Music Chappell Roan, Toni Braxton, Tina Knowles

The Alliance for Women in Media Foundation (AWMF) announces...