Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలోని
డాక్టర్
బీఆర్
అంబేద్కర్
కోనసీమ
జిల్లాలో
కేంద్ర
ప్రభుత్వ
సంస్థ
ఓఎన్‌జీసీ
చేపడుతున్న
చమురు
తవ్వకాల్లో
గ్యాస్
లీక్
అయి
భారీ
అగ్నిప్రమాదం
చోటు
చేసుకుంది.
నిన్న
ఉదయం
ప్రారంభమైన
మంటలు
ఇవాళ్టికి
కూడా
పూర్తిగా
అదుపులోకి
రాలేదు.
దీంతో
చుట్టుపక్కల
ప్రాంతాల
ప్రజల్ని
సైతం
అక్కడి
నుంచి
ఖాళీ
చేయించాల్సి
వచ్చింది.
ఈ
నేపథ్యంలో
ఓఎన్‌జీసీ
బ్లోఅవుట్
వ్యవహారంపై
విమర్శలు
వ్యక్తమవుతున్నాయి.
కోనసీమ
జిల్లా
మలికిపురం
మండలం
ఇరుసుమండ
వద్ద
ఓఎన్‌జీసీ
పైపులైన్
నుంచి
గ్యాస్
భారీగా
లీక్
కావడంతో
ఈ
అగ్ని
ప్రమాదం
చోటు
చేసుకుంది.
అయితే
అదృష్టవశాత్తూ
ఎవరికీ
ఎలాంటి
ప్రమాదం
జరగలేదు.
దీనిపై
వైసీపీ
మాజీ
ఎంపీ
విజయసాయిరెడ్డి
ఇవాళ
ఎక్స్
లో
స్పందించారు.
ఓఎన్‌జీసీ
బావిలో
గ్యాస్
లీక్
కారణంగా
అగ్నిప్రమాదం
సంభవించడం,
కోనసీమలో
సమీప
గ్రామాల
ప్రజల్ని
ఇళ్లు
ఖాళీ
చేయించాల్సిన
రావడం,
చివరికి
ప్రాణనష్టం
జరగకపోవడం
ఉపశమనం
కలిగించినా
ఇలాంటి
ఘటనలు
స్థానికుల
జీవనోపాధిని
తీవ్రంగా
దెబ్బతీస్తాయని
సాయిరెడ్డి
తెలిపారు.
Highlighting
the
gas
leak
at
an
ONGC
well
that
led
to
a
fire
and
the
evacuation
of
nearby
villages
at
Konaseema,
AP.
While
it
is
a
relief
that
there
were
no
casualties,
such
incidents
severely
affect
the
livelihood
of
locals.
I
urge
Hon’ble
Petroleum
Minister
@HardeepSPuri
ji
to…
pic.twitter.com/lEj1jDAY5T—
Vijayasai
Reddy
V
(@VSReddy_MP)
January
6,
2026
కాబట్టి
ఈ
సంఘటనపై
సమగ్ర
దర్యాప్తునకు
ఆదేశించి,
జవాబుదారీతనం
నిర్ధారించాలని
పెట్రోలియం
శాఖ
మంత్రి
హర్దీప్
సింగ్
పూరీని
విజయసాయిరెడ్డి
కోరారు.
అయితే
దీనిపై
కేంద్రం
నుంచి
ఇంకా
ఎలాంటి
స్పందనా
రాలేదు.
మరోవైపు
ఇవాళ
కూడా
గ్యాస్
లీక్
సైట్
లో
మంటలు
అర్పేందుకు
అధికారులు
తీవ్ర
ప్రయత్నాలు
చేశారు.
అయినా
సాయంత్రానికి
కూడా
పూర్తి
స్ధాయిలో
మంటలు
అదుపులోకి
రాలేదు.
దీనిపై
రాష్ట్ర
ప్రభుత్వం
కూడా
ఫాలో
అప్
చేస్తున్నా
పరిస్ధితులు
మాత్రం
సాధారణ
స్థాయికి
రాలేదు.
ఈ
నేపథ్యంలో
సాయిరెడ్డి
ట్వీట్
ప్రాధాన్యం
సంతరించుకుంది.


