క్యూలైన్ నిర్వహణలో ఇకపై..

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. బుధవారం నాడు 72,332 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,852 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది.

తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను సందర్శించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారి సదన్ కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వారితో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు.

అన్నప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యూలైన్ లల్లో భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే శ్రీవారి సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని, అందువల్ల వారు అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు. సేవ‌కులు అందించే ఫీడ్‌బ్యాక్ భక్తుల సౌకర్యాల అభివృద్ధికి, వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

అంత‌క‌ముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించి, సేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు. అనంత‌రం కొంతమంది సేవకులతో మాట్లాడ‌గా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

బ్రహ్మోత్సవాల వంటి సందర్భాల్లో శ్రీవారి సేవకులు అత్యుత్తమ సేవలను అందిస్తారని ప్రశంసించారు. వారి సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని, ఇందులో భాగంగానే వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తోన్నట్లు ఈఓ తెలిపారు. శ్రీవారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై గతంలో టీటీడీ పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటి గురించి ముద్దాడ రవిచంద్ర సూచనప్రాయంగా ప్రస్తావించారు. ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్ వైజర్ల సేవల కార్యాచరణ పురోగతి గురించి చర్చించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related