Andhra Pradesh
oi-Jakki Mahesh
సమాజంలో
పోలీసులు
అంటే
కేవలం
డ్యూటీలో
ఉన్నప్పుడే
బాధ్యతగా
ఉంటారనే
భావనను
పటాపంచలు
చేస్తూ
ఓ
మహిళా
కానిస్టేబుల్
చేసిన
పనిని
ఇప్పుడు
అందరు
మెచ్చుకుంటున్నారు.
విధి
నిర్వహణలో
లేకపోయినా
ఓ
సామాన్యుడి
ప్రాణాలను
కాపాడిన
లేదా
ఆపదలో
ఆదుకున్న
మహిళా
కానిస్టేబుల్
జయశాంతి
ఇప్పుడు
ఏపీ
పోలీస్
శాఖకు
రోల్
మోడల్‌గా
నిలిచారు.
కానిస్టేబుల్
జయశాంతి
చేసిన
సాహసానికి
ముగ్దురాలైన
ఏపీ
హోంమంత్రి
వంగలపూడి
అనిత
స్వయంగా
ఫోన్
చేసి
ఆమెను
ప్రశంసల్లో
ముంచెత్తారు.
విధి
నిర్వహణలో
లేనప్పటికీ
సమాజం
పట్ల
బాధ్యతగా
వ్యవహరించిన
తీరును
మంత్రి
కొనియాడారు.
జయశాంతి
చేసిన
పని
గురించి
తెలుసుకున్న
రాష్ట్ర
హోంమంత్రి
అనిత..
తక్షణమే
స్పందించి
ఆమెకు
ఫోన్
చేశారు.
మీ
లాంటి
వారు
ఉండటం
వల్లే
పోలీసుల
మీద
ప్రజలకు
నమ్మకం
పెరుగుతోందని
కొనియాడారు.
యూనిఫామ్‌లో
లేకపోయినా..
సమాజం
పట్ల
ఒక
పౌరురాలిగా
జయశాంతి
చూపిన
చొరవ
అద్భుతమని
మంత్రి
అభినందించారు.
ఈ
సందర్భంగా
జయశాంతి
కుటుంబ
వివరాలను,
వారి
యోగక్షేమాలను
కూడా
మంత్రి
ఆప్యాయంగా
అడిగి
తెలుసుకున్నారు.
హోంమంత్రిని
నేరుగా
కలవాలని
జయశాంతి
తన
మనసులోని
కోరికను
తెలపగా..
దానికి
మంత్రి
సానుకూలంగా
స్పందించారు.
“తప్పకుండా
త్వరలోనే
నిన్ను
కలుస్తాను..
మనందరం
కలిసి
పోలీస్
శాఖ
గౌరవాన్ని
పెంచుదాం”
అని
హామీ
ఇచ్చారు.
సోషల్
మీడియా
వేదికగా
కృతజ్ఞతలు:
మంత్రి
అనిత
కేవలం
ఫోన్
చేయడమే
కాకుండా,
తన
అధికారిక
ఎక్స్
(ట్విట్టర్)
ఖాతాలో
కూడా
జయశాంతిని
అభినందిస్తూ
పోస్ట్
చేశారు.”పోలీసుల
గౌరవాన్ని
పెంచిన
జయశాంతిని
సోషల్
మీడియాలో
అభినందించిన
ప్రతిఒక్కరికీ
పోలీస్
శాఖ
తరఫున
ధన్యవాదాలు.
జయశాంతి
చూపిన
స్ఫూర్తి
ప్రతి
ఒక్కరికీ
ఆదర్శం.”
అని
ఆమె
పేర్కొన్నారు.
పోలీసుల
గౌరవాన్ని
పెంచిన
మహిళా
కానిస్టేబుల్
జయశాంతి
గారి
నిబద్ధత
అందరిలో
స్ఫూర్తి
నింపింది.
విధుల్లో
లేకపోయినా
సమాజం
పట్ల
బాధ్యతతో
చేతిలో
చంటిబిడ్డతో
అంబులెన్స్
కు
దారి
ఇవ్వడం
కోసం
ట్రాఫిక్
క్లియర్
చేసిన
రంగంపేట
మహిళా
కానిస్టేబుల్
జయశాంతి
గారికి
ఫోన్
చేసి
అభినందించడం
జరిగింది.…
pic.twitter.com/VzyNL4eRbj—
Anitha
Vangalapudi
(@Anitha_TDP)
January
20,
2026


