India
oi-Jakki Mahesh
సాధారణంగా
సామాన్యులకు
కరెంట్
బిల్లు
వందల్లో
లేదా
వేలల్లో
వస్తే
గుండె
గుభేలుమంటుంది.
అలాంటిది
ఓ
సామాన్య
రైతుకు
ఏకంగా
రూ.222
కోట్ల
బిల్లు
వస్తే
ఆ
బిల్లు
వస్తే
పరిస్థితి
ఎలా
ఉంటుందో
అర్థం
చేసుకోవచ్చు.
యూపీలోని
నోయిడాలో
విద్యుత్
శాఖ
చేసిన
ఓ
భారీ
తప్పిదం
ఇప్పుడు
దేశవ్యాప్తంగా
చర్చనీయాంశంగా
మారింది.
అసలు
జరిగిందిదే?
ఉత్తరప్రదేశ్‌లోని
నోయిడా
సమీపంలో
గల
చిపియానా
ఖుర్ద్
గ్రామానికి
చెందిన
విపిన్
యాదవ్
అనే
రైతులకు
1000
మీటర్ల
స్థలం
ఉంది.
అక్కడ
ఆయన
5
కిలోవాట్ల(5KW)
కమర్షియల్
ఛార్జింగ్
కనెక్షన్
తీసుకున్నారు.
విపిన్
యాదవ్
ప్రతి
నెలా
క్రమం
తప్పకుండా
తన
విద్యుత్
బిల్లులను
చెల్లిస్తుంటారు.
అయితే
తాజాగా
ఆయనకు
వచ్చిన
బిల్లు
చూసి
విపిన్
ఒక్కసారిగా
షాక్‌కు
గురయ్యారు.
గత
7
నెలల
బకాయి
కింద
ఏకంగా
రూ.2,22,00,00,000
(222
కోట్లు)
చెల్లించాలని
ఆ
బిల్లులో
ఉంది.
అధికారుల
చుట్టూ
ప్రదక్షిణలు
బిల్లు
చూడగానే
ఆందోళనతో
విపిన్
యాదవ్
వెంటనే
విద్యుత్
శాఖ
కార్యాలయానికి
పరుగులు
తీశారు.
అయితే
మొదట్లో
అక్కడి
అధికారులు
ఆయన
ఫిర్యాదును
పట్టించుకోలేదని
బాధితుడు
ఆరోపిస్తున్నారు.
స్థానికంగా
ఏర్పాటు
చేసిన
ఓ
విద్యుత్
శిబిరంలో
తన
బిల్లును
తనిఖీ
చేయించగా..
సిస్టమ్‌లో
కూడా
రూ.
222
కోట్ల
బకాయి
ఉన్నట్లు
చూపించింది.
ఆశ్చర్యకరమైన
విషయం
ఏమిటంటే..
ఆన్‌లైన్‌లో
బిల్లు
డౌన్‌లోడ్
చేయడానికి
ప్రయత్నిస్తే
కేవలం
మే
నెలకు
సంబంధించిన
వివరాలు
మాత్రమే
కనిపిస్తున్నాయి.
సాంకేతిక
లోపమే
కారణం?
ఈ
ఘటనపై
విద్యుత్
శాఖ
ఎగ్జిక్యూటివ్
ఇంజనీర్
శివం
త్రిపాఠి
వివరణ
ఇచ్చారు.
సాఫ్ట్‌వేర్‌లో
ఏర్పడిన
సాంకేతిక
సమస్య
కారణంగా
ఇలాంటి
భారీ
బిల్లులు
జనరేట్
అయ్యే
అవకాశం
ఉందని
ఆయన
తెలిపారు.
సాధారణంగా
ఇటువంటి
బిల్లులు
సిస్టమ్‌లోనే
‘హోల్డ్’
అవుతాయని,
వినియోగదారులకు
వెళ్లకూడదని
చెప్పారు.
విపిన్
యాదవ్
బిల్లును
సరిచేసి,
అసలైన
మొత్తంతో
కూడిన
కొత్త
బిల్లును
అందజేస్తామని
ఆయన
హామీ
ఇచ్చారు.
టెక్నాలజీ
పెరిగినప్పటికీ,
ప్రభుత్వ
విభాగాల్లో
ఇలాంటి
చిన్న
చిన్న
పొరపాట్లు
సామాన్యులను
తీవ్ర
ఆందోళనకు
గురిచేస్తున్నాయి.
అధికారులు
తక్షణమే
స్పందించి
సమస్యను
పరిష్కరించకపోతే
బాధితులు
మరింత
ఇబ్బందులు
ఎదుర్కోవాల్సి
వస్తుంది.


