గుంతకల్-మార్కాపూర్ రోడ్ మధ్య కొత్త రైలు..! ప్రతి రోజూ టైమింగ్స్ ఇవే..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

ఆంధ్రప్రదేశ్
లోని
రాయలసీమ,
కోస్తాంధ్ర
ప్రాంతాల్ని
కలుపుతూ
మరో
కొత్త
రైలు
పట్టాలెక్కబోతోంది.
రాయలసీమలోని
గుంతకల్లుతో
మార్కాపురం
జిల్లా
మార్కాపురం
రోడ్
స్టేషన్
ను
కలుపుతూ

రైలు
ప్రయాణించించనుంది.
దీనికి
సంబంధించిన
వివరాలను
ఇవాళ
దక్షిణ
మధ్య
రైల్వే
వెల్లడించింది.
ఎప్పటి
నుంచో
ఉన్న
డిమాండ్
మేరకు

రైలు
ప్రారంభానికి
ఆమోద
ముద్ర
వేసినట్లు
అధికారులు
తెలిపారు.

దక్షిణ
మధ్య
రైల్వే
ప్రతిపాదన
మేరకు
రైల్వే
మంత్రిత్వ
శాఖ
గుంతకల్లు
-మార్కాపూర్
రోడ్-గుంతకల్లు
పాసింజర్
రైలు
ప్రారంభించేందుకు
గ్రీన్
సిగ్నల్
ఇచ్చింది.
ప్రతీ
రోజూ
ప్రయాణించే

రైలు
నంద్యాల
మీదుగా
వెళ్తుంది.

రైలు
సేవలు
త్వరలో
అందుబాటు
లోకి
రానున్నాయని
అధికారులు
తెలిపారు.
రైలు
నం.57407/
57408
గుంతకల్లు

మార్కాపూర్
రోడ్

గుంతకల్లు
రోజువారీ
ప్యాసింజర్
రైలు
సర్వీస్
యొక్క
ప్రతిపాదిత
సమయాల్ని
కూడా
వెల్లడించారు.

రైలు
నం.57407
గుంతకల్లు
నుంచి
సాయంత్రం
5.30కు
బయలుదేరే
పాసింజర్
రైలు
మార్కాపూర్
రోడ్
స్టేషన్
కు
రాత్రి
11.30కు
చేరుకోనుంది.
ఇది
మధ్యలో
నంద్యాలలో
రాత్రి
8.30కి
ఆగనుంది.
అలాగే
రైలు
నం.57408
మార్కాపూర్
రోడ్
నుంచి
ఉదయం
10.30కు
బయలుదేరి
సాయంత్రం
4.30కు
గుంతకల్లుకు
చేరుకోనుంది.

రైలు
నంద్యాలలో
ఉదయం
7.20కి
ఆగనుంది.

రైళ్లు
మార్గ
మధ్యంలో
మద్దికెర,
పెండేకల్లు,
ధోన్
,
రంగాపురం,
బేతంచెర్ల,
పాణ్యం,
నంద్యాల,
గాజులపల్లి,
దిగువమెట్ట,
గిద్దలూరు,
సోమిదేవిపల్లె,
జగ్గంభొట్ల
కృష్ణాపురం,
కంబం
మరియు
తర్లుపాడు
స్టేషన్లలో
ఇరు
వైపు
ప్రయాణంలో
ఆగుతాయి.

అలాగే

కొత్త
ప్యాసింజర్
రైలు
సర్వీసు
ప్రారంభం
ద్వారా
గుంతకల్లు,
మార్కాపూర్
రోడ్
మధ్య
ప్రయాణించే
వారికి
ప్రయోజనం
కూరడమేకాకుండా
మార్గ
మధ్యంలోని
నంద్యాల,
గిద్దలూరు,
కంభం
మొదలైన
ప్రాంతాల
ప్రజలకు
ఎంతో
ప్రయోజనం
ఉంటుందని
అధికారులు
తెలిపారు.

రైలు
విద్యార్థులకు,
వ్యాపారస్థులకు
,
ఇతర
ప్రయాణికులకు
పైన
పేర్కొన్న
స్టేషన్లకు
చేరుకోవడానికి
ఎటువంటి
ఇబ్బంది
లేకుండా,
తక్కువ
ఛార్జీతో
ప్రయాణ
సౌకర్యాన్ని
అందిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related