Telangana
oi-Korivi Jayakumar
రాష్ట్రంలోని
జనాభా
అధికంగా
ఉన్న
పట్టణాలకు
త్వరలోనే
అదనపు
ఎమ్మార్వోలు
(తహశీల్దార్లు)
కేటాయించనున్నట్లు
మంత్రి
పొంగులేటి
శ్రీనివాస్
రెడ్డి
ప్రకటించారు.
ప్రస్తుతం
రాష్ట్రంలో
లక్షా
50
వేల
నుంచి
రెండు
లక్షల
జనాభా
కలిగిన
అనేక
పట్టణాలు
ఉన్నాయని
అన్నారు.
అయితే
ప్రతి
పట్టణానికి
ఒక్క
తహశీల్దార్
మాత్రమే
ఉండటంతో
ప్రజలకు
సేవలు
అందించడంలో
ఇబ్బందులు
తలెత్తుతున్నాయని
ఆయన
స్పష్టం
చేశారు.
ఇంత
భారీ
జనాభా
ఉన్న
పట్టణానికి
ఒకే
అధికారి
ఉండటం
వల్ల
పరిపాలనాపరమైన
ఒత్తిడి
పెరుగుతోందని,
ఫైళ్ల
పరిష్కారం
ఆలస్యం
అవుతోందని
పేర్కొన్నారు.
ఈ
అంశాన్ని
త్వరలోనే
కేబినెట్లో
చర్చించి,
పట్టణ
ప్రాంతాల్లో
అదనపు
ఎమ్మార్వోల
నియామకంపై
నిర్ణయం
తీసుకుంటామని
వెల్లడించారు.
ఇందిరమ్మ
ఇండ్ల
పత్రాల
పంపిణీ..
శనివారం
పెద్దపల్లి
జిల్లాలో
పర్యటించిన
మంత్రి
పొంగులేటి
పలు
అభివృద్ధి
పనులకు
శంకుస్థాపన
చేశారు.
అలాగే
ఇందిరమ్మ
ఇండ్ల
మంజూరు
పత్రాలను
లబ్ధిదారులకు
పంపిణీ
చేశారు.
ఈ
సందర్భంగా
మాట్లాడుతూ,
కాంగ్రెస్
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చినప్పటి
నుంచి
పేదల
సంక్షేమాన్ని
ప్రధాన
లక్ష్యంగా
పెట్టుకుని
పనిచేస్తోందన్నారు.
ఇండ్లు,
రేషన్,
మహిళలకు
ఉచిత
బస్సు
ప్రయాణం
వంటి
పథకాలు
ప్రజల్లో
మంచి
ఆదరణ
పొందుతున్నాయని
చెప్పారు.
పేదల
జీవితాల్లో
నిజమైన
మార్పు
తీసుకురావడమే
తమ
ప్రభుత్వ
లక్ష్యమని
స్పష్టం
చేశారు.
కంటోన్మెంట్,
జూబ్లీహిల్స్
ఉప
ఎన్నికలు,
సర్పంచ్
ఎన్నికల్లో
కాంగ్రెస్
పార్టీకి
ప్రజలు
మద్దతుగా
నిలిచారని
మంత్రి
గుర్తుచేశారు.
ఇది
తమ
ప్రభుత్వ
పాలనకు
ప్రజలు
ఇచ్చిన
ధ్రువీకరణ
అని
వ్యాఖ్యానించారు.
ఇదే
తరహాలో
రాబోయే
మున్సిపల్
ఎన్నికల్లోనూ
కాంగ్రెస్
పార్టీకి
అండగా
నిలవాలని
ప్రజలను
కోరారు.
అలాగే
జర్నలిస్టుల
సమస్యలపై
కూడా
ఈ
ప్రభుత్వం
సానుకూలంగా
స్పందిస్తుందని
భరోసా
ఇచ్చారు.
మీడియా
సంక్షేమానికి
అవసరమైన
చర్యలు
తీసుకుంటామని
తెలిపారు.
కేటీఆర్‌పై
తీవ్ర
విమర్శలు..
ఈ
సందర్భంగా
బీఆర్ఎస్
వర్కింగ్
ప్రెసిడెంట్
కేటీఆర్‌పై
మంత్రి
పొంగులేటి
తీవ్ర
స్థాయిలో
విమర్శలు
చేశారు.
జూబ్లీహిల్స్
ఉప
ఎన్నికల్లో
ప్రజలు
చిత్తుగా
ఓడించినప్పటికీ,
మున్సిపల్
ఎన్నికల్లో
గెలుస్తామని
కేటీఆర్
పగటి
కలలు
కంటున్నారని
ఎద్దేవా
చేశారు.
ప్రజలు
వరుసగా
బీఆర్ఎస్ను
ఓడిస్తున్నా,
ఇంకా
మున్సిపల్
ఎన్నికలను
‘సెమీ
ఫైనల్’
అంటూ
మాట్లాడటం
విడ్డూరమన్నారు.
అసలు
బీఆర్ఎస్కు
ప్రజల్లో
అడ్రస్
ఉందా
అని
ప్రశ్నించారు.
ఇంట్లో
న్యాయం
చేయలేని
వారు..
ఇంటి
ఆడబిడ్డకు
న్యాయం
చేయలేని
కేటీఆర్
రాష్ట్ర
ప్రజలకు
ఎలా
న్యాయం
చేస్తాడని
మంత్రి
ప్రశ్నించారు.
గత
బీఆర్ఎస్
ప్రభుత్వం
పేదలకు
ఇండ్లు
ఇవ్వాలనే
ఆలోచనే
చేయలేదని
ఆరోపించారు.
ఇండ్లు
కడితే
కమిషన్లు
రావని,
కమిషన్లు
వచ్చే
కాళేశ్వరం
ప్రాజెక్టును
కట్టారని
విమర్శించారు.
ప్రస్తుత
కాంగ్రెస్
ప్రభుత్వం
మాత్రం
మహిళలకు
ఉచిత
బస్సు
ప్రయాణం,
పేదలకు
సన్నబియ్యం
పంపిణీ
వంటి
సంక్షేమ
పథకాలు
అమలు
చేస్తోందన్నారు.
కేటీఆర్‌ది
కాకిగోల
మాత్రమే..
ఇక
కేటీఆర్
రాజకీయాలు
కాకిగోల
తప్ప
మరేమీ
కాదని,
సీఎం
కుర్చీపై
తాపత్రయం
తప్ప
ప్రజల
కోసం
ఆలోచన
లేదని
మంత్రి
పొంగులేటి
విమర్శించారు.
ఇకనైనా
ప్రజా
తీర్పును
గౌరవించి,
పగటి
కలలు
మానుకోవాలని
హితవు
పలికారు.


