India
oi-Dr Veena Srinivas
బెంగళూరు నుంచి గోవాకు ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. బెంగళూరు గోవా మార్గంలో మరో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ రైలు ప్రారంభమైతే రెండు పర్యాటక నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది.
యశ్వంతాపూర్ నుండి మడగావ్ వరకు వందే భారత్ రైలు
బెంగళూరులోని యశ్వంతపూర్ నుంచి నడిచే ఈ రైలు గోవాలోని మడగావ్ తో కలుపుతుంది. ఈ సెమీ హై స్పీడ్ రైలు సుమారు 13 గంటలలో పూర్తి చేస్తుందని అంచనా. ఈ సెమీ హై స్పీడ్ రైలు వల్ల రెండు నగరాలలో ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ఈ రైలు మార్గమధ్యంలో హాసన్, సకలేశపుర, సుబ్రహ్మణ్య రోడ్, పడిల్ వంటి స్టేషన్లలో ఆగే అవకాశముంది.
వెస్ట్రన్ ఘాట్స్ గిరిజన ప్రాంతం కావటంతో రైలు స్పీడ్ లిమిట్
అయితే ప్రస్తుతం ఉన్న ట్రాక్ పరిస్థితులతో, వెస్ట్రన్ ఘాట్స్ గిరిజన ప్రాంతం కావటం కారణంగా ఈ రైలు సుమారు 13 గంటల పాటు ప్రయాణం చేయవచ్చని అంచనా. వందే భారత్ రైలు గరిష్ట వేగంతో నడిచే సామర్థ్యం ఉన్నప్పటికీ, వెస్టర్న్ ఘాట్స్ వద్ద వేగ పరిమితి ఉండడం వల్ల ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.
రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే అధికారికంగా ప్రకటన
ఈ రైలును వారానికి ఆరు రోజులు నడపాలని ప్రతిపాదన ఉంది. అయితే తుది నిర్ణయం మాత్రం రైల్వే బోర్డు ఆమోదంపైన ఆధారపడి ఉంది. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బెంగళూరు గోవా మధ్య ప్రయాణం చేసే పర్యాటకులకు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఈ రైలు ప్రారంభమైతే రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
వందేభారత్ సెమీ హై స్పీడ్ రైలు సౌకర్యాలు ఇవే
ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకి మడగావ్ నుండి బయలుదేరి సాయంత్రం ఆరు గంటల 40 నిమిషాలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. వందేభారత్ సెమీ హై స్పీడ్ రైలు అధునాతన సీటింగ్ సౌకర్యంతో, ఎగ్జిక్యూటివ్ మరియు చైర్ కార్ కోచ్లతో, ఆన్ బోర్డు కేటరింగ్ సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే త్వరలోనే దీనిపైన రైల్వే బోర్డు నుండి తుది నిర్ణయం రాబోతుందని తెలుస్తోంది. ఇది ఈ మార్గమధ్యంలో ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త అని చెప్పాలి.


