గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా, పశ్చిమ దేశాలలో చెలరేగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఈ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం గృహ వినియోగదారులకు గ్యాస్ సమస్య లేదని, కమర్షియల్ సిలిండర్లు ఉపయోగించే వారికి కూడా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది.

రేషన్ కార్డుదారుల కోసం కిరోసిన్ పంపిణీ

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలను అధిగమించడం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రేషన్ కార్డ్ దారుల కోసం కిరోసిన్ పంపిణీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నేటినుండి ఏపీలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ అందనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ ఏపీకి

హార్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గ్యాస్ నౌకల రాక ఆలస్యమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న విశాఖకు రావాల్సిన నౌక 26కు వాయిదా పడింది. దీంతో ప్రజలకు, గ్యాస్ కొరత ఇబ్బంది కలిగించకూడదని, గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను రాష్ట్రానికి కేటాయించింది.

ఏపీలో వారికి కిరోసిన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సౌలభ్యం కోసం ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా గిరిజన మరియు మారుమూల గ్రామీణ లబ్ధిదారులకు రేషన్ కార్డు పైన ఒక లీటర్ కిరోసిన్ ను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

త్వరలో సాధారణ స్థితికి గ్యాస్ సరఫరా

గ్యాస్ సిలిండర్ల స్టాక్ లేదని, ముందు ముందు మరింత కష్టంగా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వదంతులను నమ్మవద్దని, స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ కు గ్యాస్ సరఫరా అంతరాయం లేదని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఓటిపిని అమలు చేస్తూ, బ్లాక్ మార్కెట్ కు పాల్పడేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Cabinet clears Hate Speech and Parents Support Bills

The Telangana Cabinet approved a series of significant policy...

Miranda Hope on Taylor Frankie Paul Video Leak Theory

September 2024: Taylor Frankie Paul Speaks Out About 2023...

Kesha Announces Dates For 2026 The Freedom World Tour

Kesha just wrapped the final U.K. dates of her...