గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం సహకారంతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు, కొత్త రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే 16, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల మీదుగా చెన్నై- కోల్కత్తా తీర హైవే, నేషనల్ హైవే 716, కడప, రేణిగుంట, తిరుపతి ప్రాంతాలలో నాలుగు లైన్లుగా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులపై కీలక ప్రకటన

నేషనల్ హైవే 71, నేషనల్ హైవే 167 ఏ, నేషనల్ హైవే 67 ఇలా అనేక రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు కడప విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎన్ హెచ్ 544జి పైన కీలకప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 61.72శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28నాటికి హైవే పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

కలెక్టర్ ల సదస్సులో సీఎం చంద్రబాబు

ఇప్పటివరకు ఈ హైవేకి సంబంధించి భూసేకరణ వివాదం హైకోర్టులో ఉండడంతో పనులు నత్తనడకన సాగగా, ఇటీవల పరిష్కారం కావడంతో పనులలో వేగం పుంజుకుంది. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరుకు కేవలం ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను సంవత్సరంలో పూర్తి చేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు.

ఈ జాతీయ రహదారితో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి

ఈ రహదారి వెంట ఏర్పాటు చేసే ఇంటర్ చేంజ్ లు, రెస్ట్ ఏరియాల పనులు కూడా జరుగుతున్నట్లుగా తెలిపారు. బెంగళూరు నుంచి విజయవాడ వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారితో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కడప జిల్లాలో ఎన్ హెచ్ 67 నాలుగు లైన్లుగా విస్తరించే పనులు ముగింపు దశలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అక్కడ అటవీ అనుమతులు పెండింగ్

ఈ హైవే మధ్యలో 4.75 కిలోమీటర్ల భాగం అటవీ ప్రాంతం ఉండడంతో కాంట్రాక్టర్ ఆ భాగాన్ని డి స్కోప్ చేశారు. ఈ ప్రాంతంలో కొత్త టెండర్లను పిలవాలని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. కడప జిల్లా నుండి తిరుపతి జిల్లాకు సంబంధించిన హైవే పనులు వేగవంతమైనప్పటికీ ఓబులవారిపల్లె మండలంలోని ఓరంపాడు ప్రాంతంలో అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అనుమతులు కూడా త్వరగా వస్తే వేగంగా ఈ రహదారిని విస్తరించే అవకాశం ఉంటుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

NDA wins nine Rajya Sabha seats from Bihar, Odisha, Haryana

The National Democratic Alliance romped home with all five...

Drake DMs Fan After ‘Explaining Drake Songs to My GF’ Videos Go Viral

Drake is always watching. The Toronto rapper surprised a fan...

Nvidia’s version of OpenClaw could solve its biggest problem: security

Nvidia CEO Jensen Huang thinks every company should have...

Pedro Pascal No Facial Hair, Red Carpet Look

Pedro Pascal Looks So Different After Shaving Off...