International
oi-Jakki Mahesh
ప్రస్తుతం
అంతర్జాతీయ
రాజకీయాల్లో
గ్రీన్‌లాండ్
అంశం
చిచ్చురేపుతోంది.
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
గ్రీన్‌లాండ్
పై
పట్టు
సాధించేందుకు
చేస్తున్న
ప్రయత్నాలు,
హెచ్చరికలు
నాటో
కూటమి
ఉనికినే
ప్రశ్నార్థకం
చేస్తున్నాయి.
అయితే
డెన్మార్క్
పరిస్థితి
ఇప్పుడు
“ఎవరు
తీసిన
గోతిలో
వారే
పడతారు”
అనే
చందంగా
తయారైంది.
ఒకప్పుడు
నాటో
నిబంధనల
గురించి
డెన్మార్క్
ఏ
వాదనను
వినిపించిందో..
ఇప్పుడు
అదే
వాదన
ఆ
దేశానికి
ఉచ్చుగా
మారింది.
ఏమిటా
కర్మ
సిద్ధాంతం?
1974ల
సైప్రస్
సంక్షోభం
తలెత్తినప్పుడు
నాటో
సభ్య
దేశాలైన
గ్రీస్,
టర్కీలు
యుద్ధానికి
తలపడ్డాయి.
ఆ
సమయంలో
గ్రీస్
నాటో
సహాయం
కోరగా..
డెన్మార్క్
అడ్డుపడింది.
“నాటో
పని
బయటి
శత్రువుల
నుంచి
రక్షించడం
మాత్రమే
కానీ,
ఒక
సభ్య
దేశం
నుంచి
మరో
సభ్య
దేశాన్ని
కాపాడటం
కాదు”
అని
డెన్మార్క్
అప్పుడు
వాదించింది.
నేడు
ప్రపంచంలోనే
అత్యంత
శక్తివంతమైన
అమెరికా..
డెన్మార్క్
ఆధీనంలోని
గ్రీన్‌లాండ్‌పై
కన్నేసింది.
నాడు
డెన్మార్క్
చేసిన
వాదనే
ఇప్పుడు
అమెరికాకు
ఆయుధంగా
మారింది.
నాటో
నిబంధనల్లోని
లొసుగు
నాటో
చార్టర్‌లోని
ఆర్టికల్
5
ప్రకారం..
సభ్య
దేశంపై
‘బయటి
వ్యక్తులు’
దాడి
చేస్తే
అందరూ
కలిసి
పోరాడాలి.
కానీ
దాడి
చేసేది
కూటమిలోని
సభ్య
దేశమే
(అమెరికా)
అయితే
ఏం
చేయాలనే
దానిపై
నాటో
మౌనంగా
ఉంది.
ఇదే
ఇప్పుడు
డెన్మార్క్‌ను
భయపెడుతోంది.
ట్రంప్
టారిఫ్
హెచ్చరికలు
–
యూరోప్
దేశాల
ఉనికి
గ్రీన్‌లాండ్‌ను
దక్కించుకోవాలనే
పట్టుదలతో
ఉన్న
డొనాల్డ్
ట్రంప్,
డెన్మార్క్‌కు
మద్దతు
తెలుపుతున్న
యూరోపియన్
దేశాలపై
ఆగ్రహం
వ్యక్తం
చేస్తున్నారు.
బ్రిటన్
కేవలం
ఒక
సైనికుడిని,
నార్వే
ఇద్దరు
సైనికులను
డెన్మార్క్
మద్దతుగా
పంపాయి.
డెన్మార్క్‌కు
అండగా
నిలిచిన
యూరోపియన్
దేశాలపై
ట్రంప్
10
శాతం
అదనపు
టారిఫ్
విధించారు.
అలాగే
డెన్మార్క్‌పై
ఏకంగా
100
శాతం
టారిఫ్
విధిస్తానని
బెదిరించారు.
సైనిక
శక్తిలో
భారీ
వ్యత్యాసం
అమెరికా
ప్రపంచంలోనే
అతిపెద్ద
సైనిక
శక్తి.
మరోవైపు
డెన్మార్క్
రక్షణ
బడ్జెట్
2025లో
కేవలం
10
బిలియన్
డాలర్లు
మాత్రమే.
ఒకవేళ
అమెరికా
గ్రీన్‌లాండ్‌పై
బలప్రయోగానికి
దిగితే,
డెన్మార్క్
దానిని
అడ్డుకోవడం
దాదాపు
అసాధ్యం.
నాటో
అంతానికి
పునాది?
స్పానిష్
ప్రధాని
పెడ్రో
సాంచెజ్
హెచ్చరించినట్లుగా..
అమెరికా
బలవంతంగా
గ్రీన్‌లాండ్‌ను
ఆక్రమిస్తే
అది
నాటో
మరణశాసనం
అవుతుంది.
నాటో
చీఫ్
మార్క్
రుట్టే
ఈ
విషయంలో
మౌనం
వహించడం
కూటమిలోని
అసంతృప్తిని
సూచిస్తోంది.
గ్రీన్‌లాండ్
స్థానిక
నివాసితులు
(ఇనుయిట్)
తమ
స్వయంప్రతిపత్తి
గురించి
ఆందోళన
చెందుతున్నారు.
మిత్రుడే
శత్రువుగా
మారితే
రక్షణ
ఎవరిస్తారు?
నాటో
ఆర్టికల్-4
కేవలం
చర్చలకే
పరిమితం,
ఆర్టికల్-5
బయటి
దాడులకే
పరిమితం.
ఈ
క్లిష్ట
పరిస్థితుల్లో
డెన్మార్క్
ఒంటరి
పోరాటం
చేయాల్సి
వస్తోంది.


