చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి

Date:


India

oi-Chandrasekhar Rao

త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. దీనికి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK) పేరును ఖరారు చేశారు. ఈ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. కొబ్బరి చెట్ల పొలాన్ని పార్టీ అధికారిక చిహ్నంగా ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎమ్‌జీఆర్, జయలలిత ఫొటోలను ముద్రించివున్న పతాకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ను గుర్తుచేసుకున్నారు. ఎమ్‌జీఆర్ ప్రజల కోసం పార్టీని ప్రారంభించారని, అదే పంథాలో తాము కూడా నూతన శకానికి తెర తీశామని అన్నారు. ఎమ్‌జీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పేదల కోసమే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే పోరాడిందని, దాన్ని తాము కొనసాగిస్తామని శశికళ వివరించారు.

కొబ్బరి చెట్ల పొలాన్ని పార్టీ అధికారిక చిహ్నంగా ఆవిష్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఒక్క చెట్టు మాత్రమే ఉంటే అది పొలం అనిపించుకోదని, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి తామందరం ఒక పొలంగా రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు. కొబ్బరిచెట్టు ఎక్కడైనా బలంగా పెరుగుతుందని, అలాగే తాము కూడా రాష్ట్రంలో అన్ని చోట్లా ఉంటామని, ప్రజల్లోకి దూసుకెళ్తామని అన్నారు.

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈపీఎస్ మోసం చేశారని, ఆయన నాయకత్వంలో పార్టీ పతనమైందని ఆమె ఆరోపించారు. అందుకే తాము ఇప్పుడు ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని తేల్చి చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తే తమిళనాడు ప్రజలను మోసం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related