Andhra Pradesh
oi-Kannaiah
గత
ఎన్నికల్లో
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
ఓటమి
తర్వాత
చీపురుపల్లి
రాజకీయాల్లో
పెనుమార్పులు
జరిగాయి.
ముఖ్యంగా
విజయనగరం
జిల్లాలో
సీనియర్
రాజకీయవేత్త
బొత్స
సత్యనారాయణ
ఎమ్మెల్సీ
అవ్వటంతో
పాటు
మండలిలో
విపక్ష
నేత
హోదా
దక్కించుకున్నారు.
దీంతో
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
తరుపున
మండలిలో
బొత్స
సత్యనారాయణ
గళం
వినిపించాల్సిన
బాధ్యత
పెరిగింది.
దీంతో
బొత్స
సత్యనారాయణ
చీపురుపల్లిలోని
పార్టీ
బాధ్యతలను
వారసులకు
అప్పగిస్తూ..
వారిని
ప్రోత్సహిస్తున్నారు.
మొన్నటి
వరకు
చీపురుపల్లిలో
బొత్స
సత్యనారాయణ
తరుపున
పార్టీ
వ్యవహారాలు,
అన్నీ
తానై
విజయనగరం
జడ్‌పీ
ఛైర్మన్
మజ్జి
శ్రీనివాసరావు
చూసుకునేవారు.
చిన్న
శ్రీను
భీమిలికి..
అనూషకు
లైన్
క్లియర్!
ఇంతకాలం
చీపురుపల్లిలో
బొత్సకు
అన్నీ
తానై
వ్యవహరించిన
మేనల్లుడు,
జడ్పీ
ఛైర్మన్
మజ్జి
శ్రీనివాసరావు
(చిన్న
శ్రీను)
ఇప్పుడు
తన
మకాంను
భీమిలికి
మార్చారు.
వైఎస్
జగన్
ఆదేశాల
మేరకు
ఆయన
భీమిలి
ఇన్ఛార్జ్‌గా
వెళ్లడంతో
ఆ
స్థానాన్ని
భర్తీ
చేస్తూ
డాక్టర్
అనూష
రంగంలోకి
దిగారు.
గతంలో
చిన్న
శ్రీను
వెంటే
నడిచిన
స్థానిక
నేతలు,
కార్యకర్తలు
ఇప్పుడు
అనూష
నాయకత్వాన్ని
అంగీకరిస్తూ
ఆమెతో
కలిసి
సాగుతున్నారు.ఇప్పుడు
చీపురుపల్లిలో
పార్టీ
వ్యవహారాలను
బొత్స
సత్యనారాయణ
తరుపున
కుమార్తె
డాక్టర్
అనూషనే
చూస్తున్నారు.
ఇటీవల
జరిగిన
పలు
కార్యక్రమాలను
అన్నింటినీ
బొత్స
అనూషనే
పర్యవేక్షించటంతో
పాటు
తాను
కూడా
నాయకులతో
పాటు
పాల్గొని
కేడర్‌లో
ఉత్సాహం
నింపారు.
ఇది
చూసిన
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
కార్యకర్తలు
బొత్స
అనూషను
భవిష్యత్
నాయకురాలుగా
ప్రచారం
చేస్తున్నారు.
ప్రజల్లోకి
‘డాక్టర్’గళం..కోటి
సంతకాలతో
గుర్తింపు!
రాజకీయాల్లోకి
రాకముందే
డాక్టరుగా
ప్రజలకు
సేవ
చేసిన
అనూష,
ఇప్పుడు
రాజకీయ
రంగంలోనూ
తనదైన
ముద్ర
వేస్తున్నారు.
అందుకు
తగ్గట్లే
మెడికల్
కాలేజీల
ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా
నిర్వహించిన
కోటి
సంతకాల
సేకరణ
కార్యక్రమంలో
బొత్స
అనూషకు
ప్రతి
ఇంటా
తమ
బిడ్డగా
ఆప్యాయంగా
స్వాగతించారని
నాయకులు,
కార్యకర్తలు
సంతోషం
వ్యక్తపరిచారు.ప్రత్యేకించి
కోటి
సంతకాల
కార్యక్రమం
చీపురుపల్లిలో
విజయవంతం
అవ్వటంతో
బొత్స
అనూష
క్రియాశీలకంగా
పనిచేయటమే
కారణమని
వైఎస్‌ఆర్
కాంగ్రెస్
పార్టీ
శ్రేణులు,నాయకులు
ముక్తంఠంతో
అంటున్నారు.
హైకమాండ్
గ్రీన్
సిగ్నల్?
చీపురుపల్లిలో
అనూష
దూకుడుపై
వైఎస్సార్‌సీపీ
అధిష్టానానికి
ఎప్పటికప్పుడు
సానుకూల
నివేదికలు
అందుతున్నట్లు
సమాచారం.
తన
తండ్రి
బొత్స
సత్యనారాయణకున్న
సుదీర్ఘ
రాజకీయ
అనుభవాన్ని,
కేడర్‌పై
ఉన్న
పట్టును
అనూష
సమర్థవంతంగా
వాడుకుంటున్నారు.
మజ్జి
శ్రీను
వర్గం
కూడా
అనూష
పనితీరుపై
సంతృప్తి
వ్యక్తం
చేస్తూ,
ఆమె
వెంటే
తమ
భవిష్యత్తు
ఉంటుందన్న
భరోసాతో
ఉన్నట్లు
తెలుస్తోంది.
చీపురుపల్లి..
అనూషకు
కంచుకోట
అవుతుందా?
దశాబ్దాలుగా
బొత్స
కేంద్రంగా
నడిచిన
ఈ
నియోజకవర్గం,
ఇప్పుడు
‘బొత్స
అనూష’
పవర్
సెంటర్‌గా
మారుతోంది.
కేడర్‌తో
నిత్యం
టచ్‌లో
ఉండటం,
స్థానిక
సమస్యలపై
గళం
ఎత్తడం
చూస్తుంటే..
భవిష్యత్తులో
చీపురుపల్లి
అసెంబ్లీ
బరిలో
ఆమె
నిలవడం
ఖాయమని
విశ్లేషకులు
భావిస్తున్నారు.
తండ్రి
లెగసీని
కాపాడుకుంటూనే,
తనకంటూ
ఒక
ప్రత్యేక
గుర్తింపును
తెచ్చుకునేందుకు
అనూష
శ్రమిస్తున్నారు.
ఇంతకాలం
చీపురుపల్లి
బొత్స
కేంద్రంగానే
రాజకీయాలు
కొనసాగితే
ఇప్పుడు
ఆయన
కుమార్తె
అనూష
పవర్
సెంటర్‌గా
రాజకీయాలు
నడుస్తున్నాయి.
మొత్తానికి
అనూష
చీపురుపల్లిపై
పుల్
ఫోకస్
పెడుతున్నారని
బొత్స
అనుచర
వర్గం
చెబుతోంది.
చీపురుపల్లి
వేదికగా
జరుగుతున్న
రాజకీయం
రోజురోజుకీ
ఆసక్తికరంగా
మారుతోందని
బొత్స
అనుచరులు
సంతోషం
వ్యక్తం
చేస్తున్నారు.


