Telangana
oi-Dr Veena Srinivas
కాంగ్రెస్
పార్టీ
అగ్రనేత
రాహుల్
గాంధీ
పై
మాజీ
మంత్రి
కేటీఆర్
చేసిన
వ్యాఖ్యలను
వరంగల్
పశ్చిమ
ఎమ్మెల్యే
నాయిని
రాజేందర్
రెడ్డి
తీవ్రంగా
ఖండించారు.
హన్మకొండ
కలెక్టరేట్లో
నేడు
జరిగిన
సమీక్ష
సమావేశం
తర్వాత
మీడియాతో
మాట్లాడిన
ఆయన
రాహుల్
గాంధీ
గురించి
కేటీఆర్
మాట్లాడిన
భాష
పైన
తీవ్ర
అభ్యంతరం
వ్యక్తం
చేశారు.
రాహుల్
గాంధీ
గురించి
మాట్లాడే
స్థాయి
కేటీఆర్
కు
లేదు
ఎమ్మెల్సీగా
రాజీనామా
చేసిన
కవిత
సభలో
చేసిన
వ్యాఖ్యలపైన,
నిన్న
జనగామలో
బీఆర్ఎస్
సమావేశంలో
రాహుల్
గాంధీ
పైన
చేసిన
వ్యాఖ్యల
పైన
వరంగల్
పశ్చిమ
ఎమ్మెల్యే
నాయిని
రాజేందర్
రెడ్డి
నిప్పులు
చెరిగారు.
రాహుల్
గాంధీ
గురించి
మాట్లాడే
స్థాయి
కేటీఆర్
కు
లేదని
మండిపడ్డారు.
కేటీఆర్
వరంగల్
నగరానికి
వస్తే
చెప్పులతో
కొట్టిస్తా
రాహుల్
గాంధీని
ఉరి
తీయాలంటూ
కేటీఆర్
చేసిన
సంచలన
వ్యాఖ్యల
పైన,
రాహుల్
గాంధీపైన
నోటికొచ్చినట్టు
చేసిన
వ్యాఖ్యలపైన
మండిపడిన
ఆయన
కేటీఆర్
వరంగల్
నగరానికి
వస్తే
చెప్పులతో
కొట్టిస్తానంటూ
హెచ్చరించారు.
కేటీఆర్
కంటే
ఘాటుగా
తాము
కూడా
మాట్లాడగలమని,
కానీ
తమకు
ఆ
విచక్షణ
ఉందని
వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా
కేటీఆర్,
కవిత
భాష
మార్చుకోకపోతే
భవిష్యత్తులో
తీవ్ర
పరిణామాలు
చూస్తారని
హెచ్చరించారు.
త్వరలో
కేసీఆర్
కుటుంబ
బహిష్కరణ
సీఎం
రేవంత్
రెడ్డి
దయతలిస్తే
తాము
ఊరుకుంటున్నామని,
ఇకపైన
తమకు
సహించే
ఓపిక
లేదని
ఆయన
తేల్చి
చెప్పారు.
భవిష్యత్తులో
కేసీఆర్
కుటుంబ
బహిష్కరణ
జరుగుతుందంటూ
ఆయన
వ్యాఖ్యలు
చేశారు.
ఒక
మహిళగా
కవిత
తెలంగాణలో
ఏం
పీకి
కట్టలు
కట్టాం
అంటూ
మాట్లాడకూడని
మాటలు
మాట్లాడుతున్నారని,
తెలంగాణ
రాగానే
రాహుల్
గాంధీ
ఇంటికి
వెళ్లి
సోనియమ్మ
కాళ్లు
పట్టుకుని,
ఇప్పుడు
ఏ
విధంగా
ఇలా
వ్యాఖ్యలు
చేస్తున్నారంటూ
నిప్పులు
చెరిగారు.
క్షమాపణ
చెప్పాలని
డిమాండ్
గాంధీ
కుటుంబం
గురించి
ఏం
తెలుసని
వ్యాఖ్యలు
చేస్తున్నారంటూ
మండిపడ్డారు.
కాంగ్రెస్
పార్టీని,
రాహుల్
గాంధీ
కుటుంబాన్ని
నోటికొచ్చినట్టు
మాట్లాడితే
తగిన
మూల్యం
చెల్లించుకోవాల్సి
వస్తుంది
అంటూ
హెచ్చరికలు
జారీ
చేశారు
వరంగల్
పశ్చిమ
ఎమ్మెల్యే
నాయిని
రాజేందర్
రెడ్డి.
తక్షణం
కేటీఆర్
రాహుల్
గాంధీకి
క్షమాపణలు
చెప్పాలని,
లేదంటే
వదిలిపెట్టేది
లేదన్నారు.


