Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ జగన్ కొత్త వ్యూహా లతో రాజకీయంగా ఒకరిని మరొకరు ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న జగన్.. కీలక మంత్రాంగం సాగిస్తున్నారు. 2019లో జగన్ గెలుపుకు సహకరించిన రాజకీయ వ్యూహకర్త రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన ప్రశాంత్ కిశోర్.. తిరిగి ఇప్పుడు వైసీపీ కోసం పని చేసేలా ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతున్నట్లు తెలుస్తోంది.
2029 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని పవన్ పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమినే గెలిపిస్తేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని… ఖచ్చితంగా 2029 లో తాము అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా తాను మరో సారి పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఐ ప్యాక్ రాబిన్ శర్మ టీం ను నమ్ముకున్న జగన్ పూర్తిగా నష్టపోయారు. ఆ టీం వ్యూహాలు ఏ మాత్రం కలిసి రాలేదు. కాగా.. తిరిగి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం 2019 లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ రీ ఎంట్రీ ఇచ్చేలా వేగంగా పావులు కదులుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని ఒక కీలక నేత చొరవ తీసుకున్నట్లు సమాచారం.
ప్రశాంత్ కిశోర్ అంగీకారమేనా – జగన్ ఆలోచన ఏంటి..?
2024 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ టీడీపీ కి ఎన్నికల సమయంలో వ్యూహాల అమల్లో సహకరించారు. జగన్ లక్ష్యంగా టీడీపీకి పీకే చేసిన కొన్ని సూచనలు కలిసి వచ్చాయి. కాగా, 2024 ఎన్నికల తరువాత జగన్ కొత్తగా తన పార్టీకి రాజకీయ వ్యూహకర్త కోసం ఇద్దరితో బెంగళూరు కేంద్రం గా చర్చలు చేసారు. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం పని చేస్తుంది. అయితే, జగన్ కు 2029 ఎన్నికలు రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారటంతో తిరిగి ప్రశాంత్ కిశోర్ అవసరమని ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ పార్టీ బీహార్ ఎన్నికల్లో నామ మాత్రంగా అయినా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు తెర వెనుక సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 లో జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కోసం పని చేసారు. తిరిగవి జగన్ కోసం పని చేయటంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ ఈ ప్రతిపాదన పైన తీసుకునే నిర్ణయం.. జగన్ ఫైనల్ డెసిషన్ కీలకంగా మారుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే జూలై పార్టీ ప్లీనరీలో ఈ నిర్ణయం పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
-
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక…!?
-
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!!
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే!
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!
-
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు
-
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే!
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు..
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!


