Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
గత
అసెంబ్లీ
ఎన్నికల
ముందు
పీసీసీ
అధ్యక్షురాలిగా
ఎంట్రీ
ఇచ్చి
అనూహ్యంగా
తనకు
ఆస్తులు
ఇవ్వని
అన్న
వైఎస్
జగన్
ను
టార్గెట్
చేయడం
ప్రారంభించిన
వైఎస్
షర్మిల
(ys
sharmila)..
కూటమి
అధికారంలోకి
వచ్చాక
కూడా
అదే
తీరు
కొనసాగించారు.
కానీ
కొంతకాలంగా
జగన్
విషయంలో
ఆరోపణలకు
బ్రేక్
ఇచ్చిన
వైఎస్
షర్మిల
తిరిగి
ఇవాళ
ఆయన
పాదయాత్రను
టార్గెట్
చేస్తూ
విమర్శలకు
దిగారు.
పాదయాత్ర
ఇప్పుడు
ఎందుకని
ప్రశ్నించిన
షర్మిల..
అధికారం
ఇస్తే
ఏం
చేశారని
నిలదీశారు.
జగన్
పాదయాత్ర
ఎందుకు
?
అధికారం
కోసమే
కదా
ఈ
పాట్లు
?
అధికారం
ఇస్తే
ఏం
చేశారు
?
వైఎస్సార్
జలయజ్ఞం
పూర్తి
చేయగలిగారా?
నవరత్నాల్లో
పెట్టిన
హామీలకు
దిక్కులేదన్నారు.
అధికారంలో
వచ్చిన
6
నెలల్లో
పూర్తి
చేస్తా
అన్నారని,
అధికారం
ఇస్తే
ఎందుకు
పూర్తి
చేయలేదని
ప్రశ్నించారు.
మద్యనిషేధం
అన్నారని,
అధికారం
ఇస్తే
కల్తీ
మద్యం
పెట్టి
,
క్యాష్
పద్ధతిలో
మద్య
మాఫియా
చేశారన్నారు.
వేల
ఏళ్ల
నుంచి
నిలబడ్డ
రుషికొండను
బోడి
గుండు
చేశారని
షర్మిల
ఆరోపించారు.
అధికారం
ఇస్తే
ఒక్క
రోజు
కూడా
బయటకు
రాలేదని,
ఆ
పార్టీ
వాళ్ళకే
అందుబాటులో
లేదని
విమర్శించారు.
ఎన్నికలకి
6
నెలల
ముందు
బయటకు
వచ్చి
సిద్ధం
అంటూ
కొన్ని
నెలలు
తిరిగారన్నారు.
అంతే
తప్పిస్తే
ఒకరోజు
అయినా
ప్రజల
కోసం
బయటకు
వచ్చారా
?
అని
ప్రశ్నించారు.
ఒక
మనిషి
నిజమైన
నైజం
తెలియాలి
అంటే
అధికారం
ఇచ్చి
చూడాలన్న
అబ్రహం
లింకన్
మాటల్ని
గుర్తుచేశారు.
జగన్
ని
అధికారంలో
చూశామని,
ఆయనకు
అధికారం
సూట్
అవ్వలేదని
తెలిపారు.
జగన్
నేచర్
మారాలని,
నైజం
మారాలని,మార్పు
రావాలని
సూచించారు.
జగన్
లో
స్వార్థం
తగ్గి
మంచితనం
పెరగాలన్నారు.
అప్పుడు
దేవుడు
అధికారం
ఇస్తాడేమో
అన్నారు.
అంతవరకు
దేవుడు
,
ప్రజలు
ఆశీర్వదించడన్నారు.
ఏడాది
న్నర
తర్వాత
చేసే
పాదయాత్రకు
ఇప్పుడు
అనౌన్స్
ఎందుకని
ప్రశ్నించారు.
చిత్తశుద్ధి
లేని
యాత్రలు
ఎందుకన్నారు.


