జగన్ డైరెక్ట్ అటాక్.. తగ్గేదే లేదు

Date:


Andhra Pradesh

oi-Chandrasekhar Rao

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వర స్వామి, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత అని, చంద్ర‌బాబు త‌న‌ స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీశార‌ని విమర్శించారు.

బీఆర్ నాయుడిపై ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా ఆయన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను చంద్ర‌బాబు కాలరాశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీటీడీ ల్యాబ్ తిరస్కరించిన క్వాలిటీ లేని నెయ్యి మళ్లీ అనుమతించడం, అదే విషయాన్ని సీబీఐ-సిట్ చార్జిషీట్లలో ప్రస్తావించడం ఆందోళనకరమ‌ని అన్నారు. తిరుమల లడ్డూపై రాజకీయ దుమారం రేపుతూ, ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంద‌ని పేర్కొన్నారు.

టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని చంద్రబాబును తప్పుపట్టారు జగన్. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని, ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు.

ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, ఆయననే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారని జగన్ ఆరోపించారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని జగన్ చెప్పారు. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యమని ధ్వజమెత్తారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించిందని అన్నారు.

అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్‌ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్‌ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిందని జగన్ తెలిపారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణని అన్నారు. ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడని అన్నారు.

మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330గా ఉందని, తమ హయాంలో కూడా నెయ్యి సగటు రేటు కూడా దాదాపుగా అంతేనని గుర్తు చేశారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ, ఇందాపూర్‌ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఆరోపించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

The Hindu photo feature on Aragam which is now known as book village.

In the foothills of the Himalayas in Bandipora in...

Today’s NYT Connections: Sports Edition Hints, Answers for March 22 #545

Looking for the most recent regular Connections answers? Click here...

World Water Day 2026: Why It Is Celebrated, Theme and Everything You Need To Know

World Water Day 2026: Why It Is Celebrated,...

Tokischa Shaves Head at Madison Square Garden Concert

Tokischa shaved her head in front of a live...