Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ విచారణ వేళ ఏపీ ప్రభుత్వం ఈ అంశం పైన ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుబ్రమణ్య స్వామి సుప్రీంను ఆశ్రయించారు. దీని పైన విచారించిన సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని.. అటు సిట్.. ఇటు ఈ కమిటీ చట్టానికి లోబడి విచారణ చేయాలని నిర్దేశించింది. ఈ రోజున అసెంబ్లీ లో లడ్డూ పైన చర్చ జరగనుంది. కాగా.. జగన్ హాయంలో తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం రద్దు చేస్తూ అధికారిక నిర్ణయానికి కేబినెట్ సిద్దమైంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ లడ్డూ వివాదం పతాక స్థాయికి చేరింది. రాజకీయ చర్చగా మారింది. ఈ రోజు అసెంబ్లీలో లడ్డూ వివాదం మొదలు నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు… విచారణ ఏజెన్సీలు తేల్చిన అంశాల పైన సభలో ప్రభుత్వం చర్చకు నిర్ణయించింది. చర్చ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో టీటీడీలో అన్యమతస్థులకు ఎంట్రీ.. నిబంధనలను కఠినతరం చేయాలని డిసైడ్ అయ్యారు.
కాగా.. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారు తోంది. సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలు.. ఎస్ఐబీపీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాగా.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ఆర్-5 జోన్ లో విజయవాడ, గుంటూరు చెందిన దాదాపు 50 వేల మందికి కేటాయించిన నివాస స్థలాలను తిరిగి రెవిన్యూ నుంచి సీఆర్డీఏ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. స్థలాలు పొందిన వారికి కూటమి ప్రభుత్వ విధానం మేరకు వారి ప్రాంతాల్లోనే తిరిగి ఇంటి స్థలాలు కేటాయించనున్నారు.
అమరావతి.. లడ్డూ వ్యవహారం పై కీలక చర్చ
కాగా, అమరావతిలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి రెవిన్యూ శాఖ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ముందుగా నోటీసులు జారీ చేయనున్నారు. ఆర్ 5 జోన్ లో గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన భూములను రద్దు చేసి మరొక ప్రాంతంలో కేటాయింపు పైన చర్చించి ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకో నున్నారు.
జగన్ ప్రభుత్వం కేటాయించిన 1402.58 ఎకరాల భూమి ని తిరిగి CRDA కి అప్పగిస్తూ ఈ భేటీలో నిర్ణయించనున్నారు. గత ప్రభుత్వం R-5 జోన్ లో వేసిన లే-ఔట్లు.. భూ పంపణీ నీ రద్దు చేసిన CRD అథారిటీ నిర్ణయానికి ఆమోద ముద్ర పడనుంది. క్యాబినెట్ భేటీ తరువాత తాజా రాజకీయ పరిణామాల పై సీఎం చంద్రబాబు మంత్రలతో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వివాదం.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణ పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.


