Andhra Pradesh
oi-Sai Chaitanya
పోస్టాఫీసుల
లుక్
మారింది.
మారుతున్న
ట్రెండ్
..అవసరాలకు
అనుగుణంగా
పోస్టల్
సేవల్లోనూ
మార్పులు
తెచ్చారు.
జెన్
–
జెడ్
పోస్టాఫీసు
పేరుతో
కొత్త
కార్యాలయాలు
అందుబాటులోకి
రావటం
తో
యువత
ఆకర్షితులవుతున్నారు.
ఈ
కొత్త
జెన్
-జెడ్
పోస్టాఫీసుల్లో
ఎన్నో
ప్రత్యేకతలు
ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మక
విద్యా
సంస్థల
ప్రాంగణాల్లోనే
వీటిని
నెలకొల్పుతున్నారు.
వీసా
సేవలను
ఇక్కడ
అందుబాటులోకి
తీసుకొచ్చారు.
యువత
అవసరాలే
లక్ష్యంగా
తపాలా
శాఖ
మారుతోంది.
దేశవ్యాప్తంగా
ఇలాంటి
50
‘జెన్-జెడ్’
పోస్టాఫీసులను
ఏర్పాటు
కు
నిర్ణయించారు.
వీటిల్లో
ఎన్నో
అధునాతన..
సాంకేతిక
వినియోగంతో
సేవలను
అందిస్తున్నారు.
పోస్టాఫీసుకు
వెళ్తే
పని
పూర్తయ్యేలోపు
బోర్
కొట్టకుండా
గేమ్స్
ఆడుకో
వచ్చు.
వై-ఫైతో
ఇంటర్నెట్
వాడుకోవచ్చు.
సాధారణంగా
పోస్టాఫీసులో
కూర్చోవడానికి
కుర్చీలు
మాత్రమే
ఉంటాయి.
కానీ
ఇక్కడ
వెయిటింగ్
హాల్‌లో
ఏకంగా
టేబుల్
సాకర్’
బల్ల
కనిపిస్తుంది.
పోస్టాఫీసుకు
వచ్చిన
వారు
తమ
పని
పూర్తయ్యేలోపు,
లేదా
క్యూలో
వేచి
ఉండాల్సిన
పరిస్థితి
వస్తే
విసుగు
చెందకూడదు.
ఆ
సమయంలో
ఉల్లాసంగా
గడిపేందుకు
ఈ
గేమ్
ఆడుకోవచ్చు.
యువత
అభిరుచులకు
తగ్గట్టుగా
ఇలాంటి
మోడ్రన్
సౌకర్యాలను
కల్పించారు.
ఈ
పోస్టాఫీసు
కేవలం
కార్యాలయంలా
కాకుండా,
యువతకు
నచ్చేలా
ఆధునిక
హంగులతో
తీర్చిదిద్దారు.
ఈ
జెన్
జెడ్
పోస్టాఫీసులను
ముఖ్యంగా
ప్రతిష్టాత్మక
విద్యాసంస్థలు,
యూనివర్సిటీల
ప్రాంగణాల్లోనే
వీటిని
నెలకొల్పుతున్నారు.
యువతకు
అత్యంత
చేరువగా
ఉంటూ,
వారికి
అనుకూలమైన..
అవసరమైన
సేవలు
అందించడమే
వీటి
ప్రధాన
ఉద్దేశం.
లేఖల
బట్వాడాకే
పరిమి
కాకుండా,
పోస్టల్
శాఖను
అతిపెద్ద
‘ఈ-కామర్స్
ప్లాట్‌ఫామ్’గా
మార్చే
ప్రక్రియ
కొనసాగుతోంది.
ఆధునిక
వాతావరణం,
డిజిటల్
పేమెంట్స్,
సులభమైన
సేవల
విధానాలు
ఇక్కడ
ఉంటాయి.
పోస్టల్,
బ్యాంకింగ్,
బీమా,
ఇలా
అన్ని
రకాల
సేవలు
ఒకే
గొడుగు
కిందకు
తెచ్చారు.
ఇప్పటికే
విశాఖపట్నంలో
ఒక
జెన్-జెడ్
పోస్టాఫీసు
ఉంది.
తాజాగా
అమరావతి
విట్
క్యాంపస్‌లో
మరొకటి
అందుబాటులోకి
వచ్చింది.
కాగా,
త్వరలోనే
కర్నూలులో
కూడా
మరో
జెన్-జెడ్
పోస్టాఫీసును
ఏర్పాటు
చేసేందుకు
నిర్ణయం
తీసుకున్నారు.
విదేశాలకు
వెళ్లాలనుకునే
విద్యార్థులు
ఇక్కడే
పాస్
పోర్ట్
సేవల
కోసం
దరఖాస్తు
చేసుకోవచ్చు.
ఆధార్
కార్డులో
మార్పులు,
చేర్పులు
(నవీకరణ)
ఇక్కడే
చేసుకోవచ్చు.
పోస్టాఫీసు
ఉన్నంత
సేపు
ఉచితంగా
వై-ఫై
సదుపాయం
ఉంటుంది.
విద్యార్థులు
ఎక్కడికైనా
పార్శిల్
పంపాలంటే
ఛార్జీలో
10
శాతం
రాయితీ
ఇస్తారు.


