Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
పాతికేళ్ల
రాజకీయం
పేరుతో
జనసేన
పార్టీని
స్దాపించి
రెండు
ఎన్నికల
తర్వాత
కుదురుకున్న
పవన్
కళ్యాణ్
ప్రస్తుతం
ఇటు
సీఎం
చంద్రబాబుకూ,
అటు
ప్రధాని
మోడీకి
అత్యంత
నమ్మకస్తుడిగా
మెలుగుతున్నారు.
అలాగే
గతంలో
తాను
ప్రవచించిన
చెగువేరా,
కమ్యూనిస్టు
సిద్ధాంతాలు
వదిలిపెట్టి
సనాతన
ధర్మంవైపు
అడుగులు
వేస్తున్నారు.
దీంతో
జాతీయ
స్ధాయిలోనూ
పవన్
కళ్యాణ్
కు
ఆదరణ
పెరుగుతోంది.
ఈ
నేపథ్యంలో
ఆయన
హీరోయిన్
ఒకరు
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
పవన్
కళ్యాణ్
తో
గతేడాది
హరిహర
వీరమల్లు
చిత్రంలో
నటించిన
హీరోయిన్
నిధి
అగర్వాల్
ఆయన
గురించి
తాజాగా
ఓ
ఇంటర్వ్యూలో
షాకింగ్
వ్యాఖ్యలు
చేశారు.
పవన్
కల్యాణ్
ప్రధాని
అవుతారంటూ
నిధి
అగర్వాల్
వ్యాఖ్యానించారు.
పవన్
కల్యాణ్
పై
ఆమె
ఇంటర్వూలో
ప్రశంసల
జల్లు
కురిపించారు.
పవన్
కళ్యాణ్
గొప్ప
ధైర్యవంతుడైన
నాయకుడని
నిధి
తెలిపారు.
భవిష్యత్తులో
ఆయన
ప్రధాని
అయినా
ఆశ్చర్యపోనవసరం
లేదని
తెలిపింది.
పవన్
కల్యాణ్
ప్రధాని
అవుతారు:
నిధి
అగర్వాల్టాలీవుడ్
హీరోయిన్
నిధి
అగర్వాల్
పవన్
కల్యాణ్
పై
ప్రశంసల
వర్షం
కురిపించారు.
పవన్
కళ్యాణ్
గొప్ప
ధైర్యవంతుడైన
నాయకుడని,
భవిష్యత్తులో
ఆయన
ప్రధాని
అయినా
ఆశ్చర్యపోనవసరం
లేదని
పేర్కొన్నారు.
pic.twitter.com/uQAPlj0lPr—
ChotaNews
App
(@ChotaNewsApp)
January
21,
2026
పవన్
కళ్యాణ్
కు
జోడీగా
తాను
నటిస్తున్నప్పుడు
తన
వద్దకు
చాలా
మంది
వ్యక్తులు
వచ్చేవారని,
వారంతా
తమ
దేవుడితో
కలిసి
నటిస్తున్నందుకు
తనను
అభినందించే
వారని
నిధి
అగర్వాల్
గుర్తుచేసుకున్నారు.
పవన్
కళ్యాణ్
నిజంగానే
ప్రత్యేక
మైన
వ్యక్తి
అని,
ప్రత్యేక
వ్యక్తిత్వం
కలిగిన
వ్యక్తి
అని
నిధి
ప్రశంసల
జల్లు
కురిపించారు.
ఈ
సందర్భంగా
పవన్
కళ్యాణ్
తో
కలిసి
పనిచేసిన
అనుభవాల్ని
సైతం
ఆ
ఇంటర్వ్యూలో
నిధి
పంచుకున్నారు.
దీంతో
ఈ
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అవుతోంది.


