టార్గెట్ ఒలింపిక్స్: సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Date:


Telangana

oi-Bomma Shivakumar

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ మేరకు క్రీడాశాఖపై సమీక్ష నిర్వహించారు.అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

క్రీడాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతను ఇవ్వాలని అధికారులకు సూచనలు చేశారు. గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాక ఒలంపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలంపిక్స్ లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.

అలాగే నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related