Cinema
oi-Korivi Jayakumar
తెలుగు
చిత్రపరిశ్రమలో
సంచలనం
రేపిన
చిత్రపురి
కాలనీ
అక్రమాల
కేసు
మళ్లీ
తెరపైకి
వచ్చింది.
మణికొండలోని
చిత్రపురి
కాలనీ
హౌసింగ్
సొసైటీలో
2005
నుంచి
2020
వరకూ
జరిగిన
అక్రమాలపై
దీర్ఘకాలిక
విచారణకు
ఎండ్
కార్డ్
పడింది.
కాగా
సొసైటీలో
ప్లాట్
కేటాయింపుల
నుంచి
నిధుల
వినియోగం
వరకు
పలు
అంశాలను
పరిశీలించారు.
ఈ
మేరకు
తెలంగాణ
ప్రభుత్వానికి
గోల్కొండ
కో-ఆపరేటివ్
సొసైటీస్
డిప్యూటీ
రిజిస్ట్రార్
తుది
నివేదికను
అందజేశారు.
సొసైటీ
వ్యవహారాలలో
భారీ
అవకతవకలు
చోటుచేసుకున్నాయని,
నిధుల
దుర్వినియోగం
జరిగిందని
నివేదికలో
పేర్కొన్నట్టు
సమాచారం.
ఈ
క్రమంలోనే
తుది
నివేదికలో
పాత,
ప్రస్తుత
కమిటీ
సభ్యులు
సహా
మొత్తం
15
మంది
నేరుగా
అవకతవకలకు
కారణమన్న
నిర్ణయానికి
విచారణ
కమిటీ
వచ్చింది.
వీరిలో
పలు
సినీ
ప్రముఖులు
కూడా
ఉండటం
ప్రత్యేక
చర్చనీయాంశమైంది.
కమిటీలో
కీలక
పదవుల్లో
ఉన్నప్పుడే
వారు
నిధులను
కాజేసినట్లు,
ప్లాట్
కేటాయింపుల్లో
వివక్ష,
అక్రమ
రిజిస్ట్రేషన్లు,
ఫేక్
డాక్యుమెంట్ల
వినియోగం
కూడా
జరిగినట్లు
పేర్కొన్నారు.
తుది
విచారణ
రిపోర్టు
ఆధారంగా
ప్రభుత్వానికి
సమర్పించిన
వివరాల్లో
సొసైటీకి
జరిగిన
మొత్తం
నష్టాన్ని
రూ.43.78
కోట్లుగా
గుర్తించారు.
ఈ
మొత్తాన్ని
సంబంధిత
బాధ్యులైన
15
మంది
నుండి
వసూలు
చేయాలని,
అదనంగా
18
శాతం
వడ్డీ
కూడా
చెల్లించేలా
చర్యలు
తీసుకోవాలని
సూచించారు.
సినీ
ప్రముఖులు
సహా
15
మంది
బాధ్యులు..
రిపోర్టులో
ఉన్న
పేర్లు:
తమ్మారెడ్డి
భరద్వాజ
–
నిర్మాత
పరుచూరి
వెంకటేశ్వరరావు
–
నటుడు
వినోద్
బాల
–
నటుడు
కొమర
వెంకటేశ్
–
మాజీ
ప్రెసిడెంట్
కాదంబరి
కిరణ్
–
నటుడు
బత్తుల
రఘు
దేవినేని
బ్రహ్మానంద
వల్లభనేని
అనిల్
–
మాజీ
అధ్యక్షుడు
కె.
రాజేశ్వరరావు
జె.
రామయ్య
కె.
ఉదయ
భాస్కర్
చంద్రమధు
ప్రవీణ్
కుమార్
యాదవ్
ఎ.
మహానంద
రెడ్డి
కృష్ణ
మోహన్
–
మాజీ
సెక్రటరీ
డిప్యూటీ
రిజిస్ట్రార్
ఈ
15
మందికి
ప్రత్యేకంగా
నివేదిక
కాపీలను
పంపించారు.
ఇప్పటికే
చిత్రపురి
కాలనీ
సొసైటీలో
అక్రమాలకు
సంబంధించి
మాజీ
అధ్యక్షుడు
వల్లభనేని
అనిల్
కుమార్‌ను
పోలీసులు
అరెస్ట్
చేశారు.
అయితే
నివేదికలో
పేర్లు
ఉన్న
మరికొందరు
నిందితులు
ఇప్పటికీ
పరారీలో
ఉన్నారని,
వారి
కోసం
ప్రత్యేక
బృందాలు
ఇప్పటికే
శోధన
చేపట్టినట్లు
సమాచారం.
అవకతవకల
పరిమాణం
భారీగా
ఉండటం
వల్ల
కేసును
మరింత
బలంగా
ముందుకు
తీసుకెళ్లేందుకు
అధికార
యంత్రాంగం
సిద్ధమవుతోంది.
అక్రమాల
విచారణ
జరుగుతున్న
సమయంలోనే,
2024
ఆగస్టులో
మణికొండ
మున్సిపాలిటీ
అధికారులు
చిత్రపురి
కాలనీ
పరిధిలో
నిర్మించిన
అనుమతిలేని
విల్లాలను
కూల్చివేశారు.
అనుమతి
జీ+1కు
మాత్రమే
ఉండగా,
అక్కడ
జీ+2,
జీ+3
కట్టడాలు
నిర్మించారని
అధికారులు
గుర్తించారు.
అంతేకాకుండా
అనుమతించిన
ప్లాన్
కంటే
అధిక
సంఖ్యలో
విల్లాలను
నిర్మించి
అమ్మినట్లు
బయటపడింది.
ఇందులో
రూ.300
కోట్ల
వరకూ
భారీ
కుంభకోణం
జరిగినట్లు
ప్రాథమిక
అంచనాలు
వెల్లడిస్తున్నాయి.
సొసైటీ
ప్రధాన
ఉద్దేశం
అల్పాదాయ
వర్గాలకు
చెందిన
సినీ
కార్మికులకు
ఇళ్లు
కేటాయించడం
అయినప్పటికీ,
ఈ
ప్లాట్లు
అక్రమంగా
ఇతరులకు
కేటాయించి
పెద్ద
మోసం
జరిగిందని
నివేదిక
స్పష్టంచేసింది.
ఈ
అక్రమాల్లో
పలువురు
సెలెబ్రిటీలు,
నిర్మాతలు,
కమిటీ
సభ్యులు
భాగస్వాములయ్యారన్న
ఆరోపణలు
తీవ్ర
చర్చనీయాంశమయ్యాయి.
తుది
విచారణ
నివేదిక
వెలువడడంతో
ఇప్పుడు
కేసు
పూర్తిగా
వేగం
పుంజుకుంది.
15
మంది
బాధ్యులపై
క్రిమినల్
కేసులు
నమోదు
చేసే
అవకాశం
ఉండగా,
రికవరీ
ప్రక్రియ
కూడా
త్వరలో
ప్రారంభం
కానుంది.
మరికొందరు
సినీ
ప్రముఖుల
పేర్లు
బయటపడే
అవకాశం
ఉండటంతో
ఈ
కేసు
టాలీవుడ్
వర్గాల్లో
కూడా
సంచలనం
రేపుతోంది.


