టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

టీడీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత అయిన ఉన్నం హనుమంతరాయ చౌదరి (80) మృతి చెందారు. ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి కన్ను నుమూశారు. వయోభారం అనారోగ్య సమస్యలతో దాదాపు 60 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతపురంలోని ఆస్పత్రిలో శనివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. వార్డ్డు సభ్యుడిగా ప్రజాసేవను ఆరంభించి, ఏడు గ్రామాలకు ఏకగ్రీవ సర్పంచ్‌గా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్ఫిడ్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఆయన సేవలందించా రూ ముఖ్యంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ప్రాంతంలో ఆయన అటు రాజకీయాలను ఇటు వ్యక్తిగతంగాను చెరగని ముద్ర వేసుకున్నారు.

పార్టీ కీలక నేతల దిగ్భ్రాంతి

కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచిగా, మండలం పార్టీ అధ్యక్షులుగా, సింగల్‌ విండో అధ్యక్షులుగా వ్యవహరించారు. 1998 సెప్టెంబర్‌ 28 నుంచి 2004 మార్చి 28 వరకు మార్ఫెడ్‌ ఛైర్మన్‌గా, 2000-2010 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా,టీడీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాలలో సేవలందించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో టీడీపీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ టికెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, టీడీపీ కీలక నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన ఎర్రంపల్లిలో నిర్వహించ నున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related