India
-Bomma Shivakumar
ఉత్తర్
ప్రదేశ్
నోయిడాలో
ఒక
నిర్మాణ
స్థలంలో
ఉన్న
నీటి
గుంతలో
ఓ
యువ
ఇంజినీర్
కారు
అదుపు
తప్పి
పడిపోయింది.
ఈ
ప్రమాదంలో
ఆ
టెకీ
ప్రాణాలు
కోల్పోయాడు.
దీంతో
ఈ
ఘటనను
యూపీ
సర్కార్
సీరియస్
గా
తీసుకుంది.
ఈ
మేరకు
నోయిడా
అథారిటీ
సీఈఓ
ఎం
లోకేశ్
పై
వేటు
వేసింది.
అంతేకాక
ఈ
ప్రమాదంపై
సిట్
విచారణకు
ఆదేశించింది.
ఐదు
రోజుల్లో
రిపోర్టు
సబ్‌మిట్
చేయాలని
ఆదేశాలు
జారీ
చేసింది.
ఉత్తర్
ప్రదేశ్
నోయిడా
సెక్టార్
150
లో
కారు
అదుపుతప్పి
నీటితో
నిండిన
గుంతలో
పడి
27
ఏళ్ల
టెకీ
మరణించిన
నేపథ్యంలో
ఉత్తర్
ప్రదేశ్
ప్రభుత్వం
చర్యలకు
ఉపక్రమించింది.
ఈ
మేరకు
నోయిడా
అథారిటీ
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
ఎం.
లోకేశ్
ను
పదవి
నుంచి
తొలగించింది.
ఈ
ఘటనపై
తక్షణమే
సిట్
ను
ఏర్పాటు
చేయాలని
ఆదేశించింది.
ముఖ్యమంత్రి
యోగి
ఆదిత్యనాథ్
స్వయంగా
ఈ
ప్రమాదంపై
ఉన్నత
స్థాయి
విచారణకు
ఆదేశించారు.
అడిషనల్
డైరెక్టర్
జనరల్
ఆఫ్
పోలీస్,
జోన్
మీరట్
నేతృత్వంలో
త్రిసభ్య
దర్యాప్తు
బృందాన్ని
ఏర్పాటు
చేశారు.
ఈ
బృందంలో
మీరట్
డివిజనల్
కమిషనర్,
పబ్లిక్
వర్క్స్
డిపార్ట్‌మెంట్
చీఫ్
ఇంజనీర్
కూడా
ఉన్నారు.
ఈ
బృందం
ఐదు
రోజుల్లోగా
తమ
నివేదికను
సమర్పించి,
బాధ్యులపై
చర్యలు
తీసుకోవాలని
ఆదేశాలు
జారీ
చేశారు.
ఏం
జరిగిందంటే..?
గురుగ్రామ్
లోని
ఓ
ప్రముఖ
కంపెనీలో
సాఫ్ట్‌వేర్
ఉద్యోగిగా
యువరాజ్
మోహతా
పని
చేస్తున్నాడు.
రోజూలాగే
ఆఫీస్
ముగించుకుని
ఇంటికి
తిరిగి
వస్తున్న
క్రమంలో
నోయిడాలోని
సెక్టార్-
150లోని
ఏటీఎస్
లే
గ్రాండియోస్
కూడలి
వద్ద
ప్రమాదవశాత్తు
కారు
అదుపుతప్పి
ఓ
గోడను
ఢీకొట్టి..
ఆ
తర్వాత
పక్కనే
ఉన్న
నీటి
గుంతలో
పడిపోయింది.
ఈ
ప్రమాదంలో
27
ఏళ్ల
యువ
సాఫ్ట్‌వేర్
ఇంజినీర్
యువరాజ్
మెహతా
ప్రాణాలు
కోల్పోయాడు.
ఈ
సమయంలో
సహాయక
చర్యలు
కూడా
సకాలంలో
అందలేదనే
ఆరోపణలు
వస్తున్నాయి.
అయితే
అతివేగం,
పొగమంచు,
రోడ్డు
పరిస్థితులు..
ఈ
ప్రమాదానికి
కారణమై
ఉండవచ్చని
పోలీసులు
అనుమానిస్తున్నారు.
ఈ
ఘటనకు
ప్రత్యక్ష
సాక్షి
అయిన
మోనిందర్
మాట్లాడుతూ..
యువరాజ్
గంటా
నలభై
ఐదు
నిమిషాల
పాటు
“దయచేసి,
నన్ను
కాపాడండి,
నన్ను
రక్షించండి”
అని
ప్రాధేయపడ్డాడని
వివరించాడు.
నీటి
లోతు
ఎక్కువగా
ఉండటం,
భద్రతా
సిబ్బంది
లేకపోవడం
వల్ల
సకాలంలో
రక్షించ
లేకపోయారని
తెలిపారు.
మరోవైపు
ఇదే
ఘటనపై
యువరాజ్
తండ్రి
నోయిడా
అథారిటీపై
తీవ్ర
ఆరోపణలు
చేశారు.
సెక్టార్
150
నివాసితులు
డ్రైయిన్
కు
సమీపంలో
బారికేడ్లు,
రిఫ్లెక్టర్లు
ఏర్పాటు
చేయమని
పదేపదే
విజ్ఞప్తి
చేసినా,
అథారిటీ
పట్టించుకోలేదని
ఆవేదన
వ్యక్తం
చేశారు.
ప్రమాదం
జరిగే
అవకాశం
ఉందని
తెలిసినా
ఎలాంటి
ముందు
జాగ్రత్త
చర్యలు
తీసుకోలేదని
ఆరోపించారు.


