International
oi-Bomma Shivakumar
ఇరాన్
సుప్రీం
లీడర్
ఖమేనీ..
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
పై
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ట్రంప్
ను
ఇరాన్
ఓ
క్రిమినల్
గా
భావిస్తోందని
అన్నారు.
ఇరాన్
లో
దేశవ్యాప్తంగా
జరుగుతున్న
నిరసనలను
ట్రంప్
ప్రేరేపిస్తున్నారని,
ఇరాన్
లో
నిరసనలు,
అల్లర్లకు
ట్రంప్
కారణం
అని
ఖమేనీ
అన్నారు.
ఈ
మేరకు
ఓ
టెలివిజన్
ప్రసంగంలో
ఖమేనీ
ఈ
వ్యాఖ్యలు
చేశారు.
మరోవైపు
ఇరాన్
లోని
నిరసనకారులకు
సామూహిక
ఉరిశిక్ష
అమలు
చేయనందుకు
ఇరాన్
లోని
నాయకులకు
ట్రంప్
కృతజ్ఞతలు
చెప్పడం
విశేషం.
ఇరాన్
సుప్రీం
లీడర్
ఖమేనీ..
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
పై
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ట్రంప్
ను
ఇరాన్
క్రిమినల్
గా
పరిగణిస్తోందని
అన్నారు.
ఇటీవల
జరిగిన
ఆందోళనలను
వాషింగ్టన్
ప్రోత్సహించిందని
ఆరోపించారు.
ఇరాన్
లో
చెలరేగిన
అల్లర్లు,
నిరసనల
కారణంగా
మరణాలు,
నష్టం,
అపకీర్తి
కలిగాయని
అందుకు
కారణమైన
ట్రంప్
ను
క్రిమినల్
గా
పరిగణిస్తున్నామని
ప్రకటించారు.
మరోవైపు
ఇరాన్
లో
జరుగుతున్న
పరిణామాలపై
ట్రంప్
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
ప్రభుత్వ
వ్యతిరేక
ఆందోళనల్లో
అరెస్ట్
అయిన
800
మందికి
విధించాల్సిన
ఉరిశిక్షలను
ఇరాన్
ప్రభుత్వం
రద్దు
చేయడంపై
ట్రంప్
హర్షం
వ్యక్తం
చేశారు.
ఈ
నిర్ణయాన్ని
తాము
ఎంతో
గౌరవిస్తున్నట్లు
తెలిపారు.
ఓ
వైపు
పశ్చిమాసియాలో
ఉద్రిక్త
పరిస్థితులు
కొనసాగుతున్న
క్రమంలో
అమెరికా
అధ్యక్షుడు
ఇలాంటి
వ్యాఖ్యలు
చేయడం
చర్చనీయాంశంగా
మారింది.
ఇదిలా
ఉంటే
ఇరాన్
లో
ఆందోళనకారులకు
మద్దతుగా
దాడులు
చేయడానికి
ఇదివరకు
అమెరికా
సిద్ధమైంది.
అయితే
ప్రస్తుతం
ఈ
విషయంలో
వెనక్కు
తగ్గినట్లు
తెలుస్తోంది.
ఇరాన్
పై
దాడి
చేయడం
లేదని
స్వయంగా
ట్రంప్
తాజాగా
పేర్కొనడం
ఆసక్తిని
రేపుతోంది.
సైనిక
చర్యపై
ఇప్పటికైతే
చూసి
నిర్ణయం
తీసుకుంటామని
ట్రంప్
పేర్కొనడం
విశేషం.
ఇక
ఇరాన్
లో
గతేడాది
డిసెంబర్
లో
మొదలైన
అల్లర్లు,
నిరసనలు
క్రమంగా
దేశవ్యాప్తంగా
వ్యాపించాయి.
ఇరాన్
కరెన్సీ
విలువ
కోల్పోవడం,
నీటి
సమస్య,
నిరుద్యోగం,
పెరుగుతున్న
ధరలు
తదితర
అంశాల్లో
ప్రభుత్వ
వ్యతిరేకత
పెరిగి
నిరసనలు
పెరిగాయి.
అయితే
ఈ
అల్లర్లు,
నిరసనలను
ఇరాన్
ప్రభుత్వం
అణచివేసే
ప్రయత్నం
చేసింది.
ఇప్పటికే
వేలాదిమంది
మృతి
చెందినట్లు
మానవ
హక్కుల
సంస్థలు
పేర్కొన్నాయి.


