India
oi-Bomma Shivakumar
భారత
ప్రధాని
నరేంద్ర
మోదీ,
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
ఫోన్
లో
సంభాషించుకున్నారు.
ప్రపంచ
శాంతి,
సుస్థిరత
కోసం
కలిసి
పనిచేద్దామని
నిర్ణయానికి
వచ్చారు.
ఇరు
దేశాల
మధ్య
సత్సంబంధాలపై
సమీక్ష
జరిపారు.
ఓవైపు
భారత్
పై
అమెరికా
సుంకాలు
విధించిన
నేపథ్యంలో
ఇరు
దేశాధినేతల
మధ్య
టెలిఫోన్
సంభాషణ
ఆసక్తికరంగా
మారింది.
ఈ
మేరకు
ఇరు
దేశాల
మధ్య
వాణిజ్యం,
ఎనర్జీ,
డిఫెన్స్
తదితర
అంశాలపై
చర్చలు
జరిపారు.
మున్ముందు
భారత్-
అమెరికా
కలిసి
పనిచేయాలని
నిర్ణయానికి
వచ్చారు.
ప్రధాని
నరేంద్ర
మోదీ..
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
డిసెంబర్
11
న
టెలిఫోన్
లో
సంభాషణ
జరిపారు.
ఇరు
దేశాల
మధ్య
సత్సంబంధాలపై
సమీక్ష
చేశారు.
ఇరు
దేశాల
మధ్య
వాణిజ్యం,
ఎనర్జీ,
డిఫెన్స్
తదితర
అంశాలపై
చర్చలు
జరిపారు.
ఈ
విషయాన్ని
ప్రధాని
మోదీ
తన
అధికారిక
ఎక్స్
ఖాతా
ద్వారా
పోస్టు
చేశారు.
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తో
సంతృప్తికరమైన
చర్చ
జరిగింది.
ఇది
హృదయపూర్వకమైన
సంభాషణ.
ఇరు
దేశాల
మధ్య
ఉన్న
ద్వైపాక్షిక
సంబంధాలలో
పురోగతిని
సమీక్షించాము.
అలాగే
ప్రాంతీయ,
అంతర్జాతీయ
పరిణామాలపై
చర్చలు
జరిపాము.
ప్రపంచ
శాంతి,
స్థిరత్వం,
సుస్థిరత
కోసం
భారత్-
అమెరికా
కలిసి
పనిచేస్తూనే
ఉంటాయి’
అని
ప్రధాని
మోదీ
ఎక్స్
ద్వారా
పోస్టు
చేశారు.
మరోవైపు
భారత్
శత్రుదేశమైన
పాకిస్థాన్
తో
అమెరికా
బిగ్
డీల్
చేసుకున్నట్లు
తెలుస్తోంది.
పాకిస్థాన్
కు
చెందిన
అత్యాధునిక
F-16
యుద్ధ
విమాన
విడిభాగాలు,
టెక్నాలజీ
ట్రాన్స్
ఫర్
కు
సంబంధించి
686
మిలియన్
డాలర్ల
విలువైన
భారీ
ఆయుధ
ఒప్పందం
కుదుర్చుకున్నట్లు
సమాచారం
అందుతోంది.
ఈ
విషయాన్ని
ప్రముఖ
అంతర్జాతీయ
పత్రిక
డాన్..
తన
కథనంలో
వెల్లడించింది.
ఈ
క్రమంలో
ఇరు
దేశాల
మధ్య
రక్షణ
ఒప్పందాన్ని
భారత్
నిశితంగా
పరిశీలిస్తోంది.
అయితే
పాకిస్థాన్-
అమెరికా
మధ్య
ప్రస్తుతం
ప్రతిపాదించిన
ఈ
ఒప్పందంలో
భాగంగా
పాకిస్తాన్
F-16
విమానాల
సముదాయాన్ని
ఆధునీకరించడంతో
పాటు
వాటి
ఆపరేషనల్
భద్రతా
సమస్యలను
పరిష్కరించడమే
లక్ష్యంగా
పెట్టుకుందని
సమాచారం.


