ట్రంప్ దెబ్బకు ఖమేనీ షాక్.. రంగంలోకి వారసుడు?

Date:


International

oi-Jakki Mahesh

అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
హెచ్చరికల
నేపథ్యంలో
పశ్చిమాసియాలో
యుద్ధ
మేఘాలు
కమ్ముకున్నాయి.
అమెరికా,
ఇరాన్
దేశాల
మధ్య
ఉద్రిక్తతలు
పతాక
స్థాయికి
చేరుకున్నాయి.
అమెరికా
నుంచి
ముంచుకొస్తున్న
దాడి
ముప్పును
పసిగట్టిన
ఇరాన్
సుప్రీం
లీడర్
అయతొల్లా
అలీ
ఖమేనీ..
టెహ్రాన్‌‌లోని
ఒక
అత్యంత
సురక్షితమైన
బంకర్‌‌లో
తలదాచుకున్నట్లు
అంతర్జాతీయ
మీడియా
నివేదించింది.
డొనాల్డ్
ట్రంప్
తన
వ్యాఖ్యల్లో
ఇరాన్
నాయకత్వ
మార్పు
అవసరమని
స్పష్టం
చేసినప్పటి
నుంచి
ఖమేనీ
భద్రతపై
ఆందోళనలు
పెరిగాయి.


కొడుకు
చేతికి
పగ్గాలు..
బంకర్
నుంచి
పాలన

ఖమేనీ
బంకర్లోకి
వెళ్లడమే
కాకుండా..
తన
మూడో
కుమారుడు
మసూద్
ఖమేనీకి
పాలనాపరమైన
బాధ్యతలను
అప్పగించినట్లు
సమాచారం.
సుప్రీం
లీడర్
కార్యాలయం
రోజువారీ
కార్యకలాపాలు,
ప్రభుత్వ
విభాగాలతో
సమన్వయం
ప్రస్తుతం
మసూద్
పర్యవేక్షిస్తున్నారు.
ఖమేనీ
బస
చేస్తున్న
బంకర్
అనేక
సొరంగ
మార్గాలతో
అనుసంధానించబడి,
భారీ
వైమానిక
దాడులను
సైతం
తట్టుకునేలా
నిర్మించబడింది.


సముద్రంలో
అమెరికా
యుద్ధ
నౌకల
మోహరింపు

మరోవైపు
ఇరాన్‌ను
ముట్టడించేందుకు
అమెరికా
తన
అమ్ములపొదిలోని
అస్త్రాలన్నింటినీ
సిద్ధం
చేసింది.
హిందూ
మహాసముద్రంలో
ఉన్న
నౌకాదళం
అబ్రహం
లింకన్
క్యారియర్
స్ట్రైక్
గ్రూప్
త్వరలోనే
పర్షియన్
గల్ఫ్
లేదా
అరబ్
సముద్రంలోకి
ప్రవేశించనుంది.
యూఎస్ఎస్
స్ప్రాన్స్,
యూఎస్ఎస్
మైఖేల్
మర్ఫీ
వంటి
గైడెడ్
మిసైల్
డిస్ట్రాయర్లు
కూడా
రంగంలోకి
దిగాయి.
అధునాతన
యుద్ధ
విమానాలైన
F-35C
స్టీల్త్
ఫైటర్
జెట్స్,
F/A-18E
సూపర్
హార్నెట్‌లతో
పాటు
బ్రిటన్‌కు
చెందిన
టైఫూన్
యుద్ధ
విమానాలు
కూడా
సిద్ధంగా
ఉన్నాయి.


ఇరాన్
హెచ్చరిక

అమెరికా
కవ్వింపు
చర్యలపై
ఇరాన్
కూడా
ఘాటుగా
స్పందించింది.
తమపై
చిన్నపాటి
సైనిక
దాడి
జరిగినా,
దానిని
‘ఆల్-అవుట్
వార్’
(సర్వసమగ్ర
యుద్ధం)
గా
పరిగణిస్తామని
ఇరాన్
సైనిక
అధికారులు
హెచ్చరించారు.
తమ
సైన్యాన్ని
హై
అలర్ట్‌లో
ఉంచిన
ఇరాన్..

క్షణమైనా
ఎదురుదాడికి
దిగేందుకు
సిద్ధంగా
ఉన్నట్లు
సంకేతాలిచ్చింది.


యుద్ధ
భయం..
విమానాలు
రద్దు

ప్రాంతీయ
ఉద్రిక్తతల
నేపథ్యంలో
ఎయిర్
ఫ్రాన్స్,
కేఎల్ఎమ్
వంటి
అంతర్జాతీయ
విమానయాన
సంస్థలు
ఇజ్రాయెల్,
పరిసర
ప్రాంతాలకు
తమ
సర్వీసులను
రద్దు
చేశాయి.
ఇరాన్
అణ్వాయుధ
కార్యక్రమంపై
ట్రంప్
అసహనంగా
ఉండటం,
నాయకత్వ
మార్పుపై
ఆయన
చేసిన
వ్యాఖ్యలు

యుద్ధ
వాతావరణానికి
ప్రధాన
కారణమయ్యాయి.
ఖమేనీ
బంకర్లోకి
వెళ్లడం
అనేది
పశ్చిమాసియాలో
రాబోయే
పెను
ప్రమాదానికి
సూచికగా
విశ్లేషకులు
భావిస్తున్నారు.
ట్రంప్
వ్యూహం
ఇరాన్‌ను
లొంగదీసుకుంటుందా
లేదా
ప్రపంచ
యుద్ధానికి
దారితీస్తుందా
అనేది
వేచి
చూడాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related