International
oi-Chandrasekhar Rao
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
సాగిస్తోన్న
ప్రయత్నాలకు
గట్టి
ఎదురుదెబ్బ
తగిలింది.
ఆదిలోనే
ఆయనకు
చుక్కెదురైంది.
ఈ
వివాదంపై
స్వయానా
దేశ
ప్రధానమంత్రే
స్పందించారు.
డొనాల్డ్
ట్రంప్
కు
చురకలు
అంటించారు.
పునః
పరిశీలన
చేయాలంటూ
ట్రంప్
నుంచి
సమాచారం
అందిన
విషయాన్ని
నిర్ధారించారు.
అది
తన
పరిధిలో
లేదని,
అందుకు
తాను
బాధ్యత
వహించట్లేదని
తేల్చి
చెప్పారు.
ప్రభుత్వాన్ని
ఇందులో
లాగొద్దని
స్పష్టం
చేశారు.
నోబెల్
శాంతి
బహుమతి
నిరాకరించడంపై
ట్రంప్
తన
అసంతృప్తిని
వ్యక్తం
చేశారు.
ఇది
తన
అంతర్జాతీయ
వ్యవహారాలు,
ఫెడరాల్
రాజకీయాలపై
తన
వైఖరిని
సమూలంగా
మార్చిందని
పేర్కొన్నారు.
ఈ
మేరకు
నార్వే
ప్రధాని
జోనాస్
గార్
స్టోర్
కు
ఓ
సందేశాన్ని
పంపించారు.
ట్రంప్
నుంచి
తనకు
ఈ
సందేశం
అందిన
విషయాన్ని
జొనాస్
ధృవీకరించారు.
నోబెల్
బహుమతి
విజేతల
ఎంపికపై
నార్వే
ప్రభుత్వానికి
ఎటువంటి
అధికారం
లేదని
ట్రంప్‌కు
స్పష్టం
చేసినట్లు
తెలిపారు.
నోబెల్
బహుమతులను
ఓ
ఇండిపెండెంట్
కమిటీ
అందజేస్తుందని,
శాంతి
బహుమతి
సహా
వివిధ
రంగాల్లో
అర్హులైన
వారిని
గుర్తించే
బాధ్యత,
ఎంపిక
ప్రక్రియ,
దీనికి
గల
నిబంధనలన్నీ
కూడా
దాని
పరిధిలోనే
ఉన్నాయని
నార్వే
ప్రధాని
స్పష్టం
చేశారు.
అర్హులను
ఎంపిక
చేసే
పని
తమ
ప్రభుత్వానిది
కాదని
కుండ
బద్దలు
కొట్టారు.
ట్రంప్‌కు
కూడా
ఈ
విషయం
తెలుసుననే
భావిస్తోన్నానని
ఎద్దేవా
చేశారు.
ఈ
విషయాన్ని
స్పష్టంగా
వివరించానని
అన్నారు.
నిజానికి-
గ్రీన్‌లాండ్
విషయంలో
యూరోపియన్
యూనియన్
దేశాలపై
అమెరికా
ప్రకటించిన
తాజా
టారిఫ్
థ్రెట్
కు
వ్యతిరేకంగా
నార్వే,
ఫిన్లాండ్
స్పందించిన
విధానాన్ని
ట్రంప్
ఇందులో
ప్రస్తావించారు.
ఎనిమిది
యుద్ధాలను
ఆపినప్పటికీ
తనకు
నోబెల్
శాంతి
బహుమతిని
ఇవ్వకూడదని
నార్వే
నిర్ణయించుకుందని,
ఇది
రాజకీయ
నిర్ణయంగా
భావిస్తున్నానని
అన్నారు.
శాంతి
గురించి
మాత్రమే
ఆలోచించాలనే
తన
నిర్ణయాన్ని
ఇది
మార్చేసిందని
వ్యాఖ్యానించారు.
అమెరికాకు
ఏది
మంచిదోదాని
గురించి
ఆలోచిస్తానని
పేర్కొన్నారు.
గ్రీన్‌లాండ్‌పై
నార్వే
వైఖరిని
జొనాస్
పునరుద్ఘాటించారు.
ఈ
ప్రాంత
భద్రతకు
నాటోపై
ఆధారపడాలని
సూచించారు.
గ్రీన్‌లాండ్‌పై
త
వైఖరి
స్పష్టం
చేశామని,
గ్రీన్‌లాండ్
డెన్మార్క్
లో
ఓ
భాగం,
ఈ
విషయంలో
డెన్మార్క్
కు
తాము
పూర్తి
మద్దతు
ఇస్తామని
అన్నారు.
ఆర్కిటిక్
రీజియన్
లో
భద్రత,
స్థిరత్వాన్ని
పటిష్టం
చేయడానికి
నాటో
అన్ని
చర్యలు
తీసుకుంటుందనీ
ఆయన
స్పష్టం
చేశారు.


