ట్రంప్ మోడీ ట్రేడ్ డీల్..దేశవ్యాప్త నిరసనలు, మోదీ సర్కార్ కు రైతుసంఘాల అల్టిమేటం

Date:


India

-Dr Veena Srinivas

భారత్, అమెరికా ట్రేడ్ డీల్ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందని రైతుల నుండి విముఖత వ్యక్తం అవుతుంది. భారతదేశం, అమెరికా మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంపై పలు రైతు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా భారత వ్యవసాయ రంగం తన మనుగడను కోల్పోతుంది అని, ఇండియాలోని వ్యవసాయ రంగం అమెరికా కార్పొరేట్ కంపెనీల వశమవుతుందని వారు ఆరోపించారు.

దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు

దీనికి నిరసనగా, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్), అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్)తో పాటు అనేక రైతు సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి.ఈ వాణిజ్య డీల్ భారతీయ వ్యవసాయ రంగాన్ని అమెరికా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమేనని రైతు సంఘాల నాయకులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా రైతుల భారీ నిరసనలు

ఒప్పందంపై ఆయన చేసిన ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఈ డీల్‌పై సంతకాలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీని కోరిన ఎస్‌కేఎమ్, అలా జరగనిపక్షంలో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు ఉంటాయని హెచ్చరించింది. భారత సర్కార్ ఈ డీల్ విషయంలో రైతాంగానికి నష్టం చేసే చర్యల విషయంలో పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు.

డీల్ తో భారత్ డెయిరీ రంగంపై తీవ్ర ప్రభావం

అమెరికా నుండి వచ్చే మొక్కజొన్న, సోయాబీన్ నూనె వంటి పశుగ్రాస ఉత్పత్తుల దిగుమతి కారణంగా భారత మార్కెట్‌పై, ముఖ్యంగా డెయిరీ రంగంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని అఖిల భారత కిసాన్ సభ పేర్కొంది. ఈ ఒప్పందంతో అమెరికా, ఐరోపా సమాఖ్య ఆర్థిక వ్యవస్థలకే అధిక ప్రయోజనమని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారతదేశానికి పెద్దగా ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ట్రంప్, మోదీ దిష్టిబొమ్మల దహనం

తమ నిరసనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని క్రాంతికారీ కిసాన్ యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ ఒప్పందం తక్కువ ఆదాయం ఉన్న, అప్పులతో కుంగిపోతున్న రైతుల పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఈ డీల్ ప్రభావం గురించి గ్రామస్థులు తమను ప్రశ్నిస్తున్నారని, నిరసనల్లో పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related