India
oi-Lingareddy Gajjala
ట్రాన్స్‌జెండర్స్…
వీరు
ఎక్కడ
కనబడినా
అసహ్యించుకునే
సమాజంలో
ఉన్నాం
మనం.
దానికి
గల
కారణాలు
కూడా
బలమైనవే.
అయితే
అందరూ
ఒకేలా
ఉండరు.
కొందరూ
ట్రాన్స్‌జెండర్లుగా
మారినా
కష్టపడి
పని
చేస్తూ..
ఉన్నత
శిఖరాలను
చేరడానికి
ప్రయత్నిస్తున్నారు.
అలాంటి
వారికి
కేంద్రం
బాసటగా
నిలిచింది.
ట్రాన్స్‌జెండర్లకు
మానసికంగా
ధైర్యాన్ని
ఇవ్వడమే
కాకుండా..
సామాజికంగా
కూడా
అండగా
నిలబడే
ప్రయత్నం
చేసింది
ఉద్యోగ
భవిష్య
నిధి
(EPFO)
పీఎఫ్
(Provident
Fund)
చందాదారులకు
బిగ్
అప్డేట్
వచ్చేసింది.
వ్యక్తిగత
వివరాల
మార్పుకు
అవకాశం
కల్పించింది.
ముఖ్యంగా
ఇది
ట్రాన్స్‌జెండర్లకు
వరంగా
చెప్పొచ్చు.
ట్రాన్స్‌జెండర్
గా
మారిన
వారు
ఇప్పటి
వరకు
తమ
వ్యక్తిగత
వివరాల
మార్పుకు
పీఎఫ్
కార్యాలయాల
చుట్టూ
చెప్పులు
అరిగేలా
తిరుగుతున్నారు.
అక్కడ
అధికారులతో
మాటలు
పడుతున్నారు.
దీనిపై
దృష్టి
సారించిన
కేంద్రం
ట్రాన్స్‌జెండర్లకు
మానసికంగా,
సామాజికంగా
అండగా
ఉండే
ప్రయత్నం
చేసింది.
స్వయంగా
మార్చుకునే
అవకాశం..
ఇకపై
ట్రాన్స్‌జెండర్
వ్యక్తులు
తమ
వ్యక్తిగత
వివరాలను
పీఎఫ్
ఖాతాల్లో
స్వయంగా
మార్చుకునే
అవకాశం
కల్పించింది.
ఇది
లింగ
గుర్తింపు
హక్కుల
పరంగా
ఒక
పెద్ద
ముందడుగు.
ఇప్పటివరకు
పీఎఫ్
ఖాతాల్లో
జెండర్,
పేరు,
ఇతర
వ్యక్తిగత
వివరాలు
మార్చాలంటే
అనేక
టెక్నికల్
ఇబ్బందులున్నాయి.
వాటి
పరిష్కారానికి
కార్యాలయాల
చుట్టూ
తిరగాల్సిన
పరిస్థితి
ఉండేది.
ముఖ్యంగా
ట్రాన్స్‌జెండర్
వ్యక్తులకు
ఇది
మానసికంగా,
సామాజికంగా
ఇబ్బందికరంగా
మారేది.
ఈ
నేపథ్యంలోనే
ఉద్యోగుల
భవిష్య
నిధి
సంస్థ
(EPFO)
నిబంధనల్లో
మార్పులు
చేసింది.
గుర్తింపు
పత్రాల్లో
ఉన్న
వివరాలకు
అనుగుణంగా..
కొత్త
మార్గదర్శకాల
ప్రకారం,
ట్రాన్స్‌జెండర్
పీఎఫ్
చందాదారులు
యూనివర్సల్
అకౌంట్
నంబర్
(UAN)
ద్వారా
ఆన్‌లైన్‌లోనే
తమ
జెండ్,
పేరు
వంటి
వివరాలను
సవరించుకోవచ్చు.
ఆధార్,
ఇతర
చెల్లుబాటు
అయ్యే
గుర్తింపు
పత్రాల్లో
ఉన్న
వివరాలకు
అనుగుణంగా
ఈ
మార్పులు
చేసుకునే
వీలు
ఉంటుంది.
దీంతో
కార్యాలయాల
చుట్టూ
తిరిగే
అవసరం
తగ్గనుంది.
అయితే
ఇక్కడ
ముఖ్యమైన
విషయం
ఏంటంటే
మీ
పీఎఫ్
వివరాలు
మారడానికంటే
ముందే
మీకు
ప్రభుత్వం
నుంచి
జారీ
అయిన
గుర్తింపు
కార్డులు
కూడా
మారి
ఉండాలి.
ఆధార్,
పాన్
కార్డ్,
సర్టిఫికెట్లు,
బ్యాంక్
వివరాలు
ఇవన్నీ
మారిన
తర్వాతే
మీకు
పీఎఫ్
వివరాలు
మార్పుకు
అవకాశం
ఉంటుంది.
సామాజిక
గౌరవం,
ఆత్మవిశ్వాసం..
ఈ
నిర్ణయం
వల్ల
ట్రాన్స్‌జెండర్
ఉద్యోగులు
తమ
ఉద్యోగ
జీవితంలో
ఎదుర్కొనే
వివక్ష
తగ్గుతుందని,
సామాజిక
గౌరవం,
ఆత్మవిశ్వాసం
పెరుగుతుందని
సామాజిక
కార్యకర్తలు
చెబుతున్నారు.
ప్రభుత్వ
పథకాలలో
సమానత్వం
కూడా
దక్కుతుంది.
మొత్తానికి,
పీఎఫ్
చందాదారుల్లో
ట్రాన్స్‌జెండర్
వ్యక్తులకు
తమ
వ్యక్తిగత
వివరాలపై
పూర్తి
నియంత్రణ
కల్పించడం
ద్వారా
లింగ
సమానత్వానికి
కేంద్ర
ప్రభుత్వం
స్పష్టమైన
సంకేతం
ఇచ్చింది.


