డబుల్ బొనాంజా.. భార్యభర్తలిద్దరికీ “గ్రూప్ 2” ఉద్యోగాలు

Date:


Andhra Pradesh

oi-Korivi Jayakumar

ఆంధ్రప్రదేశ్
పబ్లిక్
సర్వీస్
కమిషన్
(APPSC)
గ్రూప్‌-2
తుది
ఫలితాలను
విడుదల
చేసింది.

రిజల్ట్స్
తో
ఎంతో
కాలంగా
ఎదురుచూస్తున్న
అభ్యర్థుల
ఆశలు
నెరవేరాయి.
2023లో
905
గ్రూప్‌-2
పోస్టుల
భర్తీకి
నోటిఫికేషన్
విడుదల
చేయగా..
కోర్టు
కేసులు,
రిజర్వేషన్
రోస్టర్,
స్పోర్ట్స్
కోటా
వివాదాల
కారణంగా
తుది
జాబితా
విడుదల
ఆలస్యమైంది.
2023
డిసెంబర్
7న
నోటిఫికేషన్
వెలువడగా..
ప్రిలిమినరీ
పరీక్ష
2024
ఫిబ్రవరి
25న,
మెయిన్స్
పరీక్షలు
2025
ఫిబ్రవరి
23న
నిర్వహించారు.

కాగా
మెయిన్స్
ఫలితాలు
2025
ఏప్రిల్
4న
వెల్లడయ్యాయి.
కానీ
తుది
ఫలితాల
విడుదలకు
మాత్రం
ఇంత
సమయం
పట్టడంతో
అభ్యర్ధులు
తీవ్ర
నిరాశతో
ఎదురుచూస్తూ
వచ్చారు.
కాగా

ఫలితాల్లో
అనేకమంది
స్ఫూర్తిదాయకమైన
విజయగాథలు
వెలుగులోకి
వచ్చాయి.
తాడిపత్రికి
చెందిన
దంపతులు
ఇద్దరూ
గ్రూప్-2
కొలువును
సాధించడం
చర్చనీయాంశంగా
మారింది.


భార్యభర్తలిద్దరికీ
ఉద్యోగాలు..

అనంతపురం
జిల్లా
గన్నెవారిపల్లికి
చెందిన
హేమచంద్ర,
వినత
దంపతులు
గ్రూప్‌-2
పరీక్షల్లో
ఉద్యోగాలు
సాధించి
ప్రత్యేక
ఆకర్షణగా
నిలిచారు.
సాఫ్ట్‌వేర్
రంగంలో
పనిచేస్తూనే,
ప్రభుత్వ
ఉద్యోగం
కోసం
ప్రయత్నిస్తూ
వచ్చారు.
లేటెస్ట్
గా
విడుదల
అయిన
ఫలితాల్లో

దంపతులిద్దరూ
ప్రభుత్వ
కొలువులు
దక్కించుకున్నారు.
వినత
సబ్-రిజిస్ట్రార్‌గా
ఎంపిక
కాగా..
హేమచంద్ర
ఎక్సైజ్
ఇన్‌స్పెక్టర్‌గా
నియామకమయ్యారు.


అన్నదమ్ములు..

మరోవైపు
శ్రీసత్యసాయి
జిల్లా
కనగానపల్లికి
చెందిన
అన్నదమ్ముల
విజయం
కూడా
ఎంతోమందికి
స్ఫూర్తినిస్తోంది.
వేణుగోపాల్
గతంలో
గ్రూప్‌-2లో
సీనియర్
అసిస్టెంట్
పోస్టును
సాధించి
ప్రస్తుతం
విజయవాడలోని
వ్యవసాయశాఖ
కమిషనర్
కార్యాలయంలో
పనిచేస్తున్నారు.
తాజాగా
విడుదలైన
ఫలితాల్లో
ఆయన
డిప్యూటీ
తహసీల్దార్‌గా
ఎంపికయ్యారు.
అలానే
వేణుగోపాల్
సోదరుడు
ఓంప్రకాశ్
కూడా
అంతకుముందు
జరిగిన
గ్రూప్‌-2లో
రెవెన్యూ
శాఖలో
జూనియర్
అసిస్టెంట్‌గా,
జిల్లా
కోర్టులో
ఫీల్డ్
అసిస్టెంట్,
ఎగ్జామినర్,
జూనియర్
సహాయకుడిగా
పలు
ఉద్యోగాలు
పొందారు.
ప్రస్తుతం
ధర్మవరం
తహసీల్దార్
కార్యాలయంలో
సేవలందిస్తున్న
ఓంప్రకాశ్..
ఈసారి
గ్రూప్-2లో
రాష్ట్ర
సచివాలయంలో
ఏఎస్‌వో
ఉద్యోగాన్ని
దక్కించుకున్నారు.

ఇక

నోటిఫికేషన్
విషయంలో
రిజర్వేషన్
రోస్టర్‌కు
సంబంధించిన
వివాదాలు,
స్పోర్ట్స్
కోటాపై
హైకోర్టులో
నడిచిన
కేసులు

ఆలస్యానికి
ప్రధాన
కారణాలుగా
నిలిచాయి.
స్పోర్ట్స్
కోటా
సర్టిఫికెట్లను
పరిశీలించే
బాధ్యతను
చేపట్టిన
షాప్
(SAP)
సంస్థ
సైతం
ఎక్కువ
సమయం
తీసుకోవడంతో
అభ్యర్థులు
సుదీర్ఘకాలం
పాటు
నిరీక్షించాల్సి
వచ్చింది.
చివరకు

వివాదాలన్నీ
ఒక
కొలిక్కి
రావడంతో
తుది
ఎంపిక
జాబితాను
విడుదల
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related