International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 17 రోజులుగా ఒకరిపై మరొకటి భీకర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన ‘డాన్సింగ్ మిసైల్’ ను ప్రయోగించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఇరాన్ ‘డాన్సింగ్ మిసైల్’ ను ప్రయోగించిన నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళనలో పడింది. సెజిల్ అనే ఈ మిసైల్.. ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణుల్లో ఒకటిగా ఉంది. ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. తాజాగా ఇజ్రాయెల్- అమెరికా స్థావరాలపై ఈ మిసైల్ ను ప్రయోగించిన నేపథ్యంలో ఇది వార్తల్లో నిలిచింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయిన 17 రోజుల తర్వాత ఈ మిసైల్ ను ప్రయోగించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
సెజిల్ మిసైల్ ను అషోరా లేదా అషురా మిసైల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది ఇరాన్ లోనే అత్యాధునిక అడ్వాన్స్ డె మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ గా పేరుగాంచింది. ఈ క్షిపణిని ఇరాన్ లోనే తయారు చేశారు. దేశీయంగా తయారు చేసిన 2 స్టేజీ, సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిసైల్ ఇది. దీని రేంజ్ దాదాపు 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇది సులభంగా ఛేదించగలిగిన సత్తా ఉంది. అలాగే 700 కిలోల సామర్థ్యం వరకు పేలోడ్ ను తీసుకెళ్లగలిగే శక్తి దీని సొంతం.
ఈ మిసైల్ చాలా ఎత్తులోనూ సులభంగా ప్రయాణించగలదు. అందుకే ఈ క్షిపణిని డాన్సింగ్ మిసైల్ అంటారు. ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ ను ఛేదించగలిగిన సత్తా ఈ మిసైల్ కు ఉంది. దాంతో దీనికి ఆ పేరు వచ్చింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సమాచారం ప్రకారం.. ఈ మిసైల్ దాదాపు 18 మీటర్ల పొడవు ఉంటుంది. 1.25 మీటర్ల డయామీటర్ ఉంటుంది. అలాగే 23,600 కిలోమీటర్ల బరువు కలిగి ఉంటుంది.
ఇక ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం 17 రోజులుగా జరుగుతూనే ఉంది. దాడుల్లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అతని కుటుంబాన్ని ఇజ్రాయెల్, అమెరికా సైన్యం హతమార్చింది. దాంతో ఈ రెండు దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.


