డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..!

Date:


Andhra Pradesh

oi-Syed Ahmed

హైదరాబాద్ శివారు మెయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుని పాజిటివ్ గా తేలిన ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ (putta Mahesh Yadav)పై విమర్శల జడి వాన కురుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష వైసీపీ ఆయన్ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. దీంతో సొంత పార్టీ టీడీపీ కూడా చేతులెత్తేసింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరడంతో పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ (congress) కూడా ఆయనపై స్పందించింది.

ఎక్స్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై ట్వీట్ చేసింది. ఇందులో ఆయన ప్రధాన మంత్రి మోడీతో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఈయన నరేంద్ర మోడీ కూటమిలోని పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్ కుమార్,
హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు, అతని రక్త పరీక్షలో మెత్ కనిపించిందని పేర్కొంది. పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసినప్పుడు, పుట్టా మహేష్ కుమార్ సహచరులు కాల్పులు జరిపారని, ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ నిండి ఉండటం కనిపించిందని తెలిపింది.

నివేదికల ప్రకారం, పుట్టా మహేష్ కుమార్ పూర్తిగా తాగి పోలీసు అధికారులపై దుర్భాషలాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ లో ఆరోపించింది. ఇది నరేంద్ర మోడీ పార్లమెంటు సభ్యుల ‘స్వభావం, ప్రవర్తన, ముఖం అంటూ విమర్శలు ఎక్కుపెట్టంది.
నరేంద్ర మోడీ తనను తాను ఒకదాని తర్వాత ఒకటిగా జలగ లాంటి వ్యక్తులతో చుట్టుముట్టారని, ఒకరు డ్రగ్స్ చేస్తారు, మరొకరు అత్యాచారం చేస్తారు, అది వారి సామర్థ్యం అని విమర్శించిదంి. దీని కారణంగానే వారికి పదోన్నతులు లభిస్తాయని తెలిపింది.
సిగ్గుచేటు అంటూ ట్వీట్ ను ముగించింది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Joseph Duggar Sexual Abuse, Molesting 9-Year-Old Girl Allegation

Jessa Duggar (m. Ben Seewald)Jim Bob and Michelle's fifth...

Neil Sedaka Cause of Death Revealed

The “Breaking Up Is Hard to Do" singer-songwriter died...

Judge Greg Mathis, Evan Ross Eliminated

The Masked Singer Reveals Iconic TV Judge, Celebrity...