డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు..

Date:


Andhra Pradesh

oi-Korivi Jayakumar

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం (మార్చి 16) పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఇచ్చి విడుదల చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న Priyanka Reddyకు కూడా స్టేషన్ బెయిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో సహకరించాలని ఇద్దరికీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని ఒక్కొక్కరిని విచారిస్తూ కీలక సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సరఫరా చేసిన నెట్‌వర్క్ ఎవరిది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

డ్రగ్స్ పరీక్షల్లో కీలక విషయాలు..

కాగా కేసులో భాగంగా నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కూడా ముఖ్యమైన విషయాలు బయటపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే Pilot Rohith Reddy, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

రాజకీయంగా వేడెక్కిన వ్యవహారం..

ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు Y. S. Sharmila ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఎంపీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం బాధ్యతా రాహిత్యమని ఆమె పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సీఎం చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.

యువతకు ఏ సందేశం?

డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లేందుకు ఇది ప్రోత్సాహం ఇచ్చేలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఓటు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఎంపీ ఏమి సమాధానం చెబుతారని కూడా ఆమె నిలదీశారు.

ఇక ఈ కేసులో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫోన్ కాల్ డేటా, పార్టీకి హాజరైన వ్యక్తుల వివరాలు, ఫామ్‌హౌస్‌లో లభించిన ఆధారాలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవసరమైతే మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

I’ve been rock-bottom depressed because of music

Self Esteem has opened up about her recent pivot to acting, explaining...

Oscar-Nominated Songwriters Share Advice for Aspiring Music Creators

Oscar Sunday is here at long last. If you’ve...