India
oi-Chandrasekhar Rao
ఈ
ఏడాది
అసెంబ్లీ
ఎన్నికలను
ఎదుర్కొనబోతోంది..
తమిళనాడు.
అధికార
డీఎంకే,
ప్రతిపక్ష
ఏఐఏడీఎంకేతో
పాటు
తమిళగ
వెట్రి
కజగం..
(TVK)
పూర్తి
స్థాయి
ఎన్నికల
సంగ్రామానికి
దిగబోతోంది.
ఫలితంగా
త్రిముఖ
పోటీ
నెలకొంది.
టీవీకే
తరఫున
ప్రముఖ
నటుడు
దళపతి
విజయ్..
తమిళనాడు
ముఖ్యమంత్రి
అభ్యర్థిగా
ఈ
ఎన్నికల
బరిలోకి
దిగనున్నారు.
ఈ
విషయాన్ని
టీవీకే
ఇదివరకే
అధికారికంగా
ప్రకటించింది
కూడా.
దీంతో
ఈ
ఎన్నికలను
డీఎంకే
ప్రతిష్ఠాత్మకంగా
తీసుకుంది.
ఈ
నేపథ్యంలో
ఓటర్లను
ఆకట్టుకోవడానికి
తనవంతు
ప్రయత్నాలు
మొదలు
పెట్టింది.
వరుసగా
రెండోసారి
అధికారంలోకి
రావడానికి
అవసరమైన
వ్యూహాలను
రూపొందించుకుంటోంది.
భారతీయ
జనతా
పార్టీతో
కలిసి
ఎన్నికల
బరిలో
దిగనుంది
ఏఐఏడీఎంకే.
సీట్ల
సర్దుబాటు
చర్చలు
సాగుతున్నాయి
ఈ
రెండు
పార్టీల
మధ్య.
మొన్నటికి
మొన్న
కేంద్ర
హోం
శాఖ
మంత్రి
అమిత్
షా
తమిళనాడులో
పర్యటించడం..
అక్కడి
రాజకీయాలను
వేడెక్కించింది.
ఈ
పరిస్థితుల
మధ్య
ఏఐఏడీఎంకే
ప్రధాన
కార్యదర్శి,
మాజీ
ముఖ్యమంత్రి
ఎడప్పాడి
పళనిస్వామి
సంచలన
ప్రకటన
చేశారు.
అసెంబ్లీ
ఎన్నికల
కోసం
పట్టాళి
మక్కల్
కచ్చి
(PMK)
తమ
కూటమిలో
చేరనున్నట్లు
తెలిపారు.
ఎన్డీఏలో
చేరబోతోందని
అన్నారు.
పీఎంకే
అధినేత
అన్బుమణి
రామదాస్‌తో
కలిసి
చెన్నైలో
విలేకరుల
సమావేశంలో
పళనిస్వామి
ఈ
ప్రకటన
చేశారు.
ఏఐఏడీఎంకే,
బీజేపీ,
పీఎంకే
కూటమిగా
ఏర్పడ్డాయని,
మరిన్ని
పార్టీలు
చేరనున్నాయని,
అవినీతిమయమైన
డీఎంకేను
గద్దె
దించడమే
తమ
కూటమి
లక్ష్యమని
పేర్కొన్నారు.
ఏఐఏడీఎంకే
నాయకత్వంలో
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేస్తామని,
భారీ
మెజారిటీతో
గెలుస్తామని
అన్బుమణి
రామదాస్
విశ్వాసం
వ్యక్తం
చేశారు.
నిజానికి-
టీవీకేతో
పీఎంకే
పొత్తు
పెట్టుకునే
అవకాశాలు
ఉన్నాయంటూ
మొదట్లో
వార్తలొచ్చినప్పటికీ..
తాజా
పరిణామాలతో
దీనికి
చెక్
పెట్టినట్టయింది.
అమిత్
షా
పర్యటించిన
అతికొద్దిరోజుల్లోనే
పీఎంకే..
ఎన్డీఏ
కూటమి
వైపు
మొగ్గు
చూపడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.
ఈ
ఎన్నికల్లో
ఏ
ఒక్కరితోనూ
తాము
పొత్తు
పెట్టుకోబోమనీ
ఇదివరకే
స్పష్టం
చేశారు
విజయ్.
ఒంటరిగానే
పోటీ
చేస్తామనీ
ప్రకటించారు.


