India
oi-Kannaiah
తమిళనాడు
రాజకీయాల్లో
సంచలన
మలుపు
తిరగబోతుందా?
నటుడు-రాజకీయ
నాయకుడు
విజయ్
నేతృత్వంలోని
తమిళగ
వెట్రి
కజగం
(TVK)తో
చేతులు
కలపాలా
అన్న
దిశగా
తమిళనాడు
కాంగ్రెస్
తీవ్రంగా
ఆలోచిస్తున్నట్లు
పార్టీ
వర్గాలు
వెల్లడిస్తున్నాయి.
ఈ
ప్రతిపాదన
రాష్ట్ర
రాజకీయ
సమీకరణాలను
పూర్తిగా
మార్చే
అవకాశం
ఉందని
రాజకీయ
విశ్లేషకులు
భావిస్తున్నారు.తమిళనాడులో
డీఎంకే
నేతృత్వంలోని
కూటమిలో
కొనసాగుతున్న
కాంగ్రెస్‌కు
పరిమిత
అవకాశాలే
లభిస్తున్నాయని
అసంతృప్తి
పెరుగుతోంది.
ఈ
నేపథ్యంలో,
విజయ్
పార్టీతో
కొత్త
కూటమి
ఏర్పాటు
చేయాలని
కొందరు
రాష్ట్ర
కాంగ్రెస్
నేతలు
ఢిల్లీ
నాయకత్వంపై
ఒత్తిడి
తెస్తున్నారని
సమాచారం.
ఈ
అంశంపై
రాహుల్
గాంధీకి
కూడా
ప్రతిపాదనలు
చేరుతున్నట్లు
తెలుస్తోంది.
కాంగ్రెస్
‘ఫార్ములా’
ఏమిటి?
నటుడు
విజయ్
స్థాపించిన
తమిళగ
వెట్రి
కజగం
త్వరలోనే
తమిళనాడు,
కేరళ,
పుదుచ్చేరి
కేంద్రపాలిత
ప్రాంతాల్లో
ఎన్నికల
బరిలో
దిగే
ప్రణాళికతో
ఉందని
రాజకీయ
వర్గాలు
చెబుతున్నాయి.
ఇదే
సమయంలో,
ఈ
కొత్త
రాజకీయ
శక్తితో
చేతులు
కలపడం
కాంగ్రెస్‌కు
వ్యూహాత్మకంగా
లాభదాయకమవుతుందని
కొందరు
నేతలు
అభిప్రాయపడుతున్నారు.తమిళనాడు
రాష్ట్ర
కాంగ్రెస్
కార్యాలయం
సత్యమూర్తి
భవన్
ఇప్పుడు
కార్యకర్తల
ఫోన్
కాల్స్‌తో
హోరెత్తిపోతోంది.
ఒకవేళ
డీఎంకే
కూటమిలో
ఉంటే
తమకు
వచ్చేది
కేవలం
20-30
సీట్లు
మాత్రమే
అని..
అదే
విజయ్‌తో
కలిస్తే
కాంగ్రెస్‌కు
కనీసం
70
నుంచి
80
సీట్లు
వచ్చే
అవకాశం
ఉందని
కిందిస్థాయి
కార్యకర్తలు
హైకమాండ్‌కు
మొరపెట్టుకుంటున్నారు.అంతేకాదు,టీవీకేతో
కలిస్తే
అధికారంలో
వాటా
దక్కుతుందని,
అవసరమైతే
డిప్యూటీ
సీఎం
పదవి
కూడా
వచ్చే
ఛాన్స్
ఉందని
వారు
ఆశ
పడుతున్నారు.ఇటీవల
బలహీనపడిన
పార్టీ
శక్తిని
మళ్లీ
చైతన్యవంతం
చేస్తుందని
భావిస్తున్నారు.ఈ
ఒత్తిడి
కాంగ్రెస్
హైకమాండ్‌ను
ఆలోచనలో
పడేసిందని
తెలుస్తోంది.
కేరళ,
పుదుచ్చేరిలోనూ
ప్రభావం?
విజయ్‌తో
కూటమి
ప్రభావం
తమిళనాడుకే
పరిమితం
కాదని
వ్యూహకర్తలు
చెబుతున్నారు.కేరళలో
బీజేపీ
పట్టు
పెంచుకుంటున్న
వేళ,అక్కడ
కాంగ్రెస్
తన
సంప్రదాయ
ఓటు
బ్యాంకును
కాపాడుకోవడానికి
ఈ
కూటమి
ఉపయుక్తమవుతుందని
అంచనా.
విజయ్‌కు
ఉన్న
ప్రజాదరణ,
కాంగ్రెస్
ప్రచారానికి
మానసికంగా,
రాజకీయంగా
బలమిస్తుందని
విశ్లేషకుల
అభిప్రాయపడుతున్నారు.
విజయ్‌కు
తమిళనాడుతో
పాటు
కేరళలో
కూడా
భారీ
ఫ్యాన్
బేస్
ఉంది.అక్కడ
బీజేపీ
బలపడుతున్న
తరుణంలో,విజయ్
మద్దతు
కాంగ్రెస్‌కు
అదనపు
బలాన్ని
ఇస్తుందని
రాహుల్
గాంధీ
బృందం
భావిస్తోంది.ఈ
కూటమి
పుదుచ్చేరిలో
కూడా
అధికారంలోకి
రావడానికి
మార్గం
సుగమం
చేస్తుందని
అంచనా
వేస్తున్నారు.
కాంగ్రెస్‌లో
భిన్నాభిప్రాయాలు:
అయితే,
సీనియర్
నేతలు
మల్లికార్జున
ఖర్గే,
పీ.
చిదంబరం,
సెల్వ
పెరుంతగై
వంటి
వారు
మాత్రం
డీఎంకేతోనే
కొనసాగాలని
భావిస్తున్నారు.
డీఎంకే
కూటమిలో
ఉంటే
గెలుపు
అవకాశాలు
ఎక్కువగా
ఉంటాయనేది
వారి
వాదన.
కానీ,
“ప్రభుత్వంలో
భాగస్వామ్యం
లేనప్పుడు
ఎంఎల్ఏలుగా
ఉండి
ఏం
లాభం?”
అని
మరో
వర్గం
నేతలు
ప్రశ్నిస్తున్నారు.డీఎంకే
కూటమిలో
అధికార
భాగస్వామ్యం
లేని
పరిస్థితి
కాంగ్రెస్‌కు
దీర్ఘకాలంలో
నష్టమేనని
వారు
భావిస్తున్నారు.
కొంతమంది
నేతలు
మరో
కోణంలో
ఆలోచిస్తున్నారు.
కూటములు
శాశ్వతం
కావని,
అవసరమైతే
2026
అసెంబ్లీ
ఎన్నికల
తర్వాత
లేదా
2029
లోక్‌సభ
ఎన్నికలకు
ముందు
డీఎంకే-కాంగ్రెస్
మళ్లీ
కలిసి
వచ్చే
అవకాశమూ
ఉందని
వారు
అంటున్నారు.
ప్రస్తుతం
తీసుకునే
నిర్ణయం
భవిష్యత్
రాజకీయ
వ్యూహాన్ని
నిర్ణయించనుందన్నది
వారి
అభిప్రాయం.
విజయ్
–
రాహుల్
స్నేహం:
టీవీకే
ప్రతినిధులు
కాంగ్రెస్‌ను
“సహజ
మిత్రుడు”అని
సంబోధించడం
విశేషం.
రాహుల్
గాంధీ,
విజయ్
మధ్య
ఉన్న
వ్యక్తిగత
స్నేహం
ఈ
పొత్తుకు
పునాది
కావచ్చని
సమాచారం.
ఇప్పటికే
రాహుల్
సన్నిహితుడు
ప్రవీణ్
చక్రవర్తి,
విజయ్‌ను
కలవడం
ఈ
వార్తలకు
మరింత
బలాన్ని
చేకూర్చింది.
ఈ
మొత్తం
వ్యవహారంపై
అంతిమ
నిర్ణయం
కాంగ్రెస్
హైకమాండ్‌దే.కార్యకర్తల
భావోద్వేగాలు,ప్రాంతీయ
వ్యూహాలు,దక్షిణాది
రాష్ట్రాల్లో
పార్టీ
భవిష్యత్తు
రాజకీయ
లెక్కలు
అన్నింటినీ
పరిగణలోకి
తీసుకొని
రాహుల్
గాంధీ,
సోనియా
గాంధీతో
చర్చించి
తుది
నిర్ణయం
తీసుకునే
అవకాశం
ఉందని
పార్టీ
వర్గాలు
చెబుతున్నాయి.ఒకవేళ
కాంగ్రెస్
గనుక
డీఎంకేకు
హ్యాండ్
ఇచ్చి
విజయ్
చేయి
అందుకుంటే,
2026
ఎన్నికలు
తమిళనాడు
చరిత్రలోనే
అత్యంత
ఉత్కంఠభరితమైనవిగా
మారుతాయి
అని
చెప్పడంలో
సందేహం
లేదు.


