తిరుమలలో ఒకేరోజు సప్త వాహనాలపై తిరుమలేశుడు.. ఎప్పుడంటే!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

కలియుగ
ప్రత్యక్ష
దైవం,
ఏడుకొండల
పైన
కొలువైన
తిరుమల
శ్రీ
వెంకటేశ్వర
స్వామి
ఆలయంలో
జనవరి
25న
రథసప్తమి
పర్వదినం
ఘనంగా
జరగనుంది.
మాఘ
శుక్ల
పక్ష
సప్తమిని
రథసప్తమి
లేదా
మాఘ
సప్తమి
అంటారు.
రథసప్తమిని
సూర్య
జయంతిగా
కూడా
చెబుతారు.

రోజున
జ్ఞాన
ప్రదాత
సూర్యదేవుడు
జన్మించాడు.
కనుక

రోజున
సూర్యుని
జన్మదినాన్ని
రథసప్తమి
గా
‘మినీ
బ్రహ్మోత్సవాలు’గా
నిర్వహిస్తారు.


రథసప్తమికి
టీటీడీ
విస్తృత
ఏర్పాట్లు


క్రమంలో
టీటీడీ
భక్తుల
కోసం
విస్తృత
ఏర్పాట్లు
చేస్తోంది.
రథసప్తమి
నాడు
తిరుమలకు
భారీ
సంఖ్యలో
భక్తులు
వస్తారు.
ఆరోజు
స్వామి
వారు
సప్త
వాహనాల
పైన
ఊరేగి
భక్తులకు
దర్శనం
ఇస్తారు.
ఇక
రథసప్తమి
పర్వదినాన
ఉదయం
5:30
నుండి
ఎనిమిది
గంటల
వరకు
(సూర్యోదయం
6:45
గంటలకు)
స్వామివారిని
సూర్యప్రభ
వాహనం
పైన
ఊరేగిస్తారు.


స్వామివారికి
వాహన
సేవలు

9గంటల
నుండి
10
గంటల
వరకు
స్వామివారిని
చిన్నశేష
వాహనంపై
ఊరేగిస్తారు.
11గంటల
నుండి
12
గంటలకు
స్వామివారు
గరుడ
వాహనంపై
ఊరేగుతూ
భక్తులకు
దర్శనం
ఇస్తారు.
మధ్యాహ్నం
1
గంట
నుండి
2
గంటలకు
హనుమంత
వాహనంపై
స్వామి
వారు
విహరిస్తారు.
మధ్యాహ్నం
2గంటల
నుండి
3
గంటలకు
చక్రస్నానం
నిర్వహిస్తారు.
సాయంత్రం
4
గంటల
నుండి
5
గంటల
వరకు
స్వామివారికి
కల్పవృక్ష
సేవ
నిర్వహిస్తారు.


సప్తవాహనాలపై
ఊరేగనున్న
స్వామివారు

సాయంత్రం
6
గంటల
నుండి
7
గంటలకు
సర్వభూపాల
వాహనంపై
స్వామివారు
విహరిస్తారు.
రాత్రి
8
గంటల
నుండి
9
గంటలకు
చంద్రప్రభ
వాహనాలపై
భక్తులకు
దర్శనం
ఇస్తారు.
మొత్తం
రథసప్తమి
నాడు
సప్త
వాహనాలపై
ఊరేగి
స్వామి
వారు
భక్తులను
కరుణిస్తారు.
తిరుమలలో
రథసప్తమి
కారణంగా
స్వామివారి
కల్యాణోత్సవం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్సవం,
సహస్రదీపాలంకరణ
సేవలను
టీటీడీ
రద్దు
చేసింది.


రథసప్తమికి
టీటీడీ
సూచనలు

సుప్రభాత
సేవ,
తోమాల
సేవ,
అర్చన
సేవలను
మాత్రం
ఏకాంతంగా
నిర్వహించనుంది.
ఇక
రథసప్తమి
పర్వదినాన్ని
పురస్కరించుకొని
స్వామివారి
వాహన
సేవలను
దృష్టిలో
పెట్టుకొని
భక్తులు
తదనుగుణంగా
ప్రణాళికలు
చేసుకొని
తిరుమలకు
రావాలని
టీటీడీ
భక్తులకు
సూచిస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related