తిరుమల
వెళ్లే
శ్రీవారి
భక్తులకు
శుభవార్త..
జనవరి
(2025)
నెల
స్వామివారి
ఆర్జీత
సేవా,
వర్చువల్,
అంగప్రదక్షిణం
సహా
ఇతర
దర్శనం,
గదుల
బుకింగ్
టికెట్లకు
సంబంధించిన
షెడ్యూల్‌ను
అధికారులు
విడుదల
చేశారు.
అక్టోబర్
19వ
తేది
నుంచి
24వ
తేదీ
వరకు
ఈ
కోటా
టిక్కెట్లను
విడుదల
చేయనున్నట్లు
టీటీడీ
పేర్కొంది.
ఈ
మేరకు
ఈ
నెల
(అక్టోబర్)
19వ
తేదిన
శ్రీవారి
ఆర్జిత
సేవా
టికెట్ల
కోటాను
విడుదల
చేయనుంది.
తిరుమల
శ్రీవారి
ఆర్జిత
సేవా
ఆన్
లైన్
టికెట్లకు
సంబంధించి
వచ్చే
ఏడాది
జనవరి
నెల
కోటాను
ఈనెల
19వ
తేదిన
ఉదయం
10
గంటలకు
టీటీడీ
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనున్నట్లు
అధికారులు
వివరించారు.
ఈ
సేవాటికెట్ల
ఎలక్ట్రానిక్
డిప్
కోసం
ఈ
నెల
(అక్టోబరు)
21వ
తేదీ
ఉదయం
10
గంటల
వరకు
ఆన్‌లైన్‌లో
నమోదు
చేసుకోవచ్చని
అధికారులు
పేర్కొన్నారు.
ఎలక్ర్టానిక్
డిప్‌లో
టికెట్లు
పొందిన
భక్తులు
అక్టోబర్
21వ
తేది
నుంచి
23వ
తేదీ
వరకు
మధ్యాహ్నం
12
గంటల
లోపు
సొమ్ము
చెల్లించాల్సి
ఉంటుందని
తెలిపారు.
వారికి
లక్కీడిప్‌లో
టికెట్లు
మంజూరవుతాయని
వివరించారు.
వీటితోపాటు
తిరుమల
స్వామివారి
కల్యాణోత్సవం,
ఊంజల్
సేవ,
ఆర్జిత
బ్రహ్మోత్సవం,
సహస్రదీపాలంకార
సేవా
టికెట్లను
ఈ
నెల
(అక్టోబర్)
22వ
తేదీ
ఉదయం
10
గంటలకు
విడుదల
చేయనున్నట్లు
ఆలయ
అధికారులు
ప్రకటించారు.
అక్టోబర్
22న..
శ్రీవారి
జనవరి
నెలకోటాకు
సంబంధించి
వర్చువల్
సేవలు,
వాటి
దర్శన
స్లాట్లకు
సంబంధించి
టిక్కెట్లను
ఈ
నెల
(అక్టోబరు)
22వ
తేదీ
మధ్యాహ్నం
3
గంటల
సమయంలో
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనున్నట్లు
ఆలయ
అధికారులు
తెలిపారు.
వీటితోపాటు
2025
జనవరి
నెలకు
సంబంధించిన
అంగప్రదక్షిణం
టోకెన్ల
కోటాను
కూడా
ఈ
నెల
23వ
తేదీ
ఉదయం
10
గంటలకు
టీటీడీ
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనుంది.
శ్రీవాణి
టికెట్లు..
తిరుమల
స్వామివారి
శ్రీవాణి
టికెట్లకు
సంబంధించిన
జనవరి
నెల
ఆన్
లైన్
కోటాను
ఈ
నెల
(అక్టోబరు)
23వ
తేదీ
ఉదయం
11
గంటలకు
విడుదల
చేయనున్నారు.
వీటితో
పాటు
వయోవృద్ధులు,
దివ్యాంగులు,
దీర్ఘకాలిక
వ్యాధులున్నవారు
తిరుమల
స్వామివారిని
దర్శనం
కోసం
జనవరి
నెల
ఉచిత
ప్రత్యేక
దర్శనం
టోకెన్ల
కోటాను
అక్టోబరు
23వ
తేదీ
మధ్యాహ్నం
మూడు
గంటలకు
టీటీడీ
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనుంది.
స్పెషల్
ఎంట్రీ
టిక్కెట్లు..
జనవరి
(2025)
నెలకు
సంబంధించిన
స్పెషల
ఎంట్రీ
టికెట్ల
కోటాను
ఈ
నెల
(అక్టోబరు)
24వ
తేదీ
ఉదయం
10
గంటలకు
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనున్నట్లు
ఆలయ
అధికారులు
పేర్కొన్నారు.
వీటితోపాటు
తిరుమల,
తిరుపతిలో
2025
జనవరి
నెల
గదుల
కోటా
టిక్కెట్లను
కూడా
అక్టోబరు
24వ
తేదీ
మధ్యాహ్నం
3
గంటలకు
ఆన్‌లైన్‌లో
విడుదల
చేయనున్నట్లు
టీటీడీ
పేర్కొంది.
భక్తులు
ఇతర
పూర్తి
సమాచారం
కోసం
టీటీడీ
అధికారిక
వెబ్
సైట్
https://ttdevasthanams.ap.gov.inను
సంపప్రదించగలరు.
అలాగే,
శ్రీవారి
ఆర్జితసేవలు,
దర్శన
టికెట్లు
బుక్
చేసుకోవాలనుకునేవారు
కూడా
ఈ
వెబ్‌సైట్‌ను
సంప్రదించాల్సిందే.
నేడు
పౌర్ణమి
గరుడ
సేవ..
తిరుమల
స్వామివారి
ఆలయంలో
నేడు
(అక్టోబరు
17న)
పౌర్ణమి
గరుడసేవ
వైభవంగా
నిర్వహించనున్నట్లు
టీటీడీ
పేర్కొంది.
ప్రతినెలా
పౌర్ణమి
రోజున
టీటీడీ
గరుడ
సేవ
కార్యక్రమం
నిర్వహిస్తున్న
సంగతి
తెలిసిందే.
ఇందులో
భాగంగా
రాత్రి
7గంటల
నుంచి
9
గంటల
మధ్య
శ్రీమలయప్ప
స్వామి
గరుడునిపై
తిరుమాడ
వీధులలో
విహరించి
భక్తులకు
కనిపిస్తారు.


