Telangana
oi-Korivi Jayakumar
తెలంగాణ
రాష్ట్రంలో
వాహనాలపై
‘Press’
అనే
పదం
వాడకంపై
రాష్ట్ర
సమాచార,
పౌర
సంబంధాల
శాఖ
(I&PR)
కీలక
నిర్ణయం
తీసుకుంది.
ఇకపై
ప్రభుత్వం
నుంచి
అధికారికంగా
గుర్తింపు
పొందిన
అక్రిడిటేషన్
కార్డు
ఉన్న
జర్నలిస్టులు
మాత్రమే
తమ
వాహనాలపై
‘Press’
అనే
పదాన్ని
ఉపయోగించుకోవాలని
స్పష్టం
చేస్తూ
అధికారిక
ఉత్తర్వులు
జారీ
చేసింది.
ఈ
నిర్ణయంతో
రాష్ట్రవ్యాప్తంగా
వాహనాలపై
ప్రెస్
లోగో
వినియోగానికి
స్పష్టమైన
నిబంధనలు
అమల్లోకి
వచ్చాయి.
సెంట్రల్
మోటార్
వెహికల్
యాక్ట్
–
1989
ప్రకారం,
అనధికారికంగా
వాహనాలపై
లేదా
రిజిస్ట్రేషన్
నెంబర్
ప్లేట్లపై
‘Press’
అనే
పదాన్ని
ఉపయోగించడం
చట్టరీత్యా
నేరమని
అధికారులు
పేర్కొన్నారు.
ప్రభుత్వ
అనుమతి
లేకుండా
ఈ
గుర్తులను
వాడితే
చట్టపరమైన
చర్యలు
తప్పవని
హెచ్చరించారు.
ఇటీవల
కాలంలో
అనేక
మంది
వ్యక్తులు
ప్రైవేట్
సంస్థలు,
యూట్యూబ్
ఛానెల్స్,
చిన్న
మీడియా
సంస్థలు
ఇచ్చే
ఐడీ
కార్డులను
ఆధారంగా
చేసుకుని
తమ
వాహనాలపై
‘Press’
స్టిక్కర్లు,
బోర్డులు
ఉపయోగిస్తున్నారని
ప్రభుత్వానికి
ఫిర్యాదులు
అందాయి.
కొందరు
ఈ
గుర్తింపును
దుర్వినియోగం
చేస్తూ
చట్టాన్ని
ఉల్లంఘిస్తున్నారన్న
ఆరోపణల
నేపథ్యంలో
ప్రభుత్వం
ఈ
కఠిన
నిర్ణయం
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
జిల్లా
అధికారులకు
స్పష్టమైన
ఆదేశాలు..
సమాచార
శాఖ
కమిషనర్
జారీ
చేసిన
మెమో
ప్రకారం,
రాష్ట్రవ్యాప్తంగా
ఉన్న
అన్ని
జిల్లా
పౌర
సంబంధాల
అధికారులు
(DPROs)
తమ
పరిధిలో
ఈ
నిబంధనలు
ఖచ్చితంగా
అమలయ్యేలా
చూడాలని
ఆదేశించారు.
అక్రిడిటేషన్
కార్డు
లేని
వారు
వాహనాలపై
ఉన్న
‘Press’
లోగోలు,
స్టిక్కర్లు,
బోర్డులను
వెంటనే
తొలగించాలని
సూచించారు.
ప్రస్తుతం
అనేక
మీడియా
సంస్థల్లో
పనిచేస్తున్న
జర్నలిస్టులు
తమ
సంస్థలు
ఇచ్చిన
ఐడీ
కార్డులతోనే
వాహనాలపై
‘Press’
గుర్తులు
వాడుతున్నారు.
అయితే
తాజా
ఉత్తర్వుల
ప్రకారం,
కేవలం
ప్రభుత్వ
అక్రిడిటేషన్
కార్డు
ఉన్నవారికే
ఈ
హక్కు
పరిమితం
కావడం
వల్ల,
అక్రిడిటేషన్
లేని
జర్నలిస్టులకు
ఇది
ఇబ్బందికరంగా
మారే
అవకాశం
ఉంది.
అయితే
ప్రభుత్వం
ఈ
నిర్ణయం
వెనుక
ఉన్న
ఉద్దేశ్యం
నకిలీ
జర్నలిస్టులను
అరికట్టడం,
నిజమైన
జర్నలిస్టులకు
స్పష్టమైన
గుర్తింపు
కల్పించడమేనని
అధికారులు
చెబుతున్నారు.
ప్రెస్
గుర్తును
దుర్వినియోగం
చేస్తూ
ట్రాఫిక్
నిబంధనలు
ఉల్లంఘించడం,
అధికారులను
బెదిరించడం
వంటి
ఘటనలు
జరగకుండా
ఉండేందుకే
ఈ
చర్యలు
తీసుకున్నట్లు
సమాచారం.
నిబంధనలను
అతిక్రమించిన
వారిపై
రవాణా
శాఖ,
పోలీస్
శాఖ
ద్వారా
జరిమానాలు,
చట్టపరమైన
చర్యలు
తీసుకునే
అవకాశం
ఉందని
ప్రభుత్వం
హెచ్చరించింది.
భవిష్యత్తులో
ప్రత్యేక
డ్రైవ్‌ల
ద్వారా
‘Press’
లోగో
వాహనాలపై
తనిఖీలు
నిర్వహించే
యోచనలో
కూడా
అధికారులు
ఉన్నట్లు
తెలుస్తోంది.
మొత్తంగా
ఈ
నిర్ణయం
మీడియా
రంగంలో
పారదర్శకతను
తీసుకురావడంతో
పాటు,
జర్నలిస్టుల
గుర్తింపుకు
ఒక
స్పష్టమైన
వ్యవస్థను
ఏర్పరుస్తుందని
భావిస్తున్నారు.
అయితే
అక్రిడిటేషన్
ప్రక్రియను
మరింత
సులభతరం
చేయాలన్న
డిమాండ్
కూడా
జర్నలిస్టుల
నుంచి
వినిపిస్తోంది.


