Telangana
oi-Chandrasekhar Rao
ఇంకొద్ది
రోజుల్లో
తెలుగు
లోగిళ్లల్లో
సంక్రాంతి
పండగ
సందడి
నెలకొనబోతోంది.
దీనికోసం
రెండు
తెలుగు
రాష్ట్రాలు
సిద్ధమౌతోన్నాయి.
ఇంటి
ముందు
రంగవల్లులు,
కోడిపందేలు,
గంగిరెద్దుల
ఆటలతో
వారం
రోజుల
పాటు
ఏపీ,
తెలంగాణల్లో
పండగ
కోలాహలం
ఏర్పడనుంది.
తెలుగువారికి
సంక్రాంతి
పెద్ద
పండుగ.
కుటుంబ
సభ్యుల
మధ్య
ఆనందోత్సాహాలతో
ఈ
పండగను
జరుపుకోవడానికి
స్వస్థలాలకు
తరలి
వెళ్లడం
ఆనవాయితీ.
ఈ
నేపథ్యంలో
పాఠశాలలు,
కాలేజీలకు
సెలవులను
తెలంగాణ
ప్రభుత్వం
ఖరారు
చేసింది.
పాఠశాలల
సంక్రాంతి
సెలవులను
పొడిగించింది.
ఈ
మేరకు
పాఠశాల
విద్య
మంత్రిత్వ
శాఖ
డైరెక్టర్
నవీన్
నికోలస్
అధికారికంగా
ఉత్తర్వులు
జారీ
చేశారు.
దీని
ప్రకారం-
తెలంగాణలో
అన్నిప్రభుత్వ,
ప్రైవేటు
పాఠశాలలు,
కళాశాలలు,
ఇతర
విద్యాసంస్థలకు
ఈ
నెల
10
నుండి
16వ
తేదీ
వరకూ
సెలవులు
లభించాయి.
వచ్చే
శనివారం
నాడు
మూత
పడే
స్కూళ్లు..
మళ్లీ
తెరుచుకునేది
ఆ
తరువాతి
శనివారమే.
ఎప్పట్లాగే
ఆ
నెల
14వ
తేదీన
బుధవారం
నాడు
సంక్రాంతి
పండగ
సందడి
మొదలవుతుంది.
ఆ
రోజున
భోగి.
15వ
తేదీ
గురువారం
సంక్రాంతి.
ఆ
మరుసటి
రోజు
కనుమ
పండగ.
అప్పటివరకూ
అంటే
శుక్రవారం
వరకూ
సెలవులు
కొనసాగుతాయి.
పాఠశాలలు
మళ్లీ
తెరచుకునేది
17వ
తేదీ
శనివారం
నాడే.
మొత్తంగా
వారం
రోజుల
పాటు
తెలంగాణలో
సంక్రాంతి
కోలాహలం
కనిపించబోతోంది.
రాష్ట్రంలోని
అన్ని
పాఠశాలలు
ఈ
ఉత్తర్వులను
పాటించాలని
నవీన్
నికోలస్
తెలిపారు.


