Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ
రైజింగ్
విజన్
2047
లక్ష్య
సాధన
దిశగా
ఈ
ఏడాది
రాష్ట్ర
ప్రభుత్వం
మరింత
ముందుకు
సాగుతుందని
ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
రైతులతో
పాటు
మహిళలు,
కార్మికులు
సహా
అన్ని
వర్గాల
ప్రజల
ఆశలు,
ఆకాంక్షలను
నెరవేర్చేందుకు
ప్రభుత్వం
ప్రాధాన్యమిస్తుందని
పేర్కొన్నారు.
2026
లక్ష్యం
ఇదే
అన్న
సీఎం
రేవంత్
కొత్త
ఏడాదిలో
ప్రతి
కుటుంబం
ఆశించిన
ఉన్నత
లక్ష్యాలను
చేరుకోవాలని
ఆకాంక్షించారు.
2026
సంవత్సరంలో
అభివృద్ధి
ప్రజా
సంక్షేమంలో
తెలంగాణ
వేగవంతమైన
పురోగతిని
సాధిస్తుందని
సీఎం
రేవంత్
రెడ్డి
ఆశాభావం
వ్యక్తం
చేశారు
.తెలంగాణ
రాష్ట్ర
ప్రజలందరికీ
నూతన
సంవత్సర
శుభాకాంక్షలు
తెలియజేసిన
ఆయన
ఈ
సంవత్సరం
తమ
లక్ష్యం
ఇదేనని
స్పష్టం
చేశారు.
కొత్త
సంవత్సరం
వైద్యఆరోగ్య
రంగంలో
శుభ
పరిణామం:
మంత్రి
దామోదర
రాజనర్సింహ
కొత్త
సంవత్సరంలో
4
కొత్త
మల్టీ
సూపర్
స్పెషాలిటీ
ఆసుపత్రులను
ప్రజలకు
అందుబాటులోకి
తీసుకొస్తామని
వైద్య
శాఖ
మంత్రి
దామోదర్
రాజనర్సింహ
తెలిపారు.
గుండె,
కిడ్నీ
సంబంధిత
వ్యాధులతోపాటు
క్యాన్సర్
వంటి
వాటికి
సైతం
పేదలకు
పైసా
ఖర్చు
లేకుండా
ఈ
ఆసుపత్రుల్లో
వైద్యసేవలు
అందిస్తామన్నారు.
ప్రజలకు
నూతన
సంవత్సర
శుభాకాంక్షలు
తెలుపుతూ
వైద్య,
ఆరోగ్యశాఖ
బలోపేతంపై
మంత్రి
ఒక
ప్రకటన
విడుదల
చేశారు.
వైద్య
ఆరోగ్య
రంగానికి
ఈ
ఏడాది
మరింత
ప్రాధాన్యత
2026లో
అసంక్రమిక
వ్యాధుల
నివారణ,
చికిత్స,
పాలియేటివ్
కేర్‌పై
మరింత
దృష్టి
సారిస్తామన్నారు.
రోడ్డు
ప్రమాదాల్లో
గాయపడినవారికి
అత్యవసర
సేవలందించడానికి
ఈ
ఏడాదిలో
వందకుపైగా
క్రిటికల్
కేర్
బ్లాక్స్,
ట్రామా
కేర్
కేంద్రాలు
అందుబాటులోకి
తీసుకొస్తామని
మంత్రి
పేర్కొన్నారు.
ప్రభుత్వం
వైద్య
ఆరోగ్య
రంగానికి
ఎక్కువ
ప్రాధాన్యత
ఇస్తుందని
చెప్పారు.
నేడు
గవర్నర్
ఓపెన్
హౌస్
ఇదిలా
ఉంటే
ఆంగ్ల
నూతన
సంవత్సరం
సందర్భంగా
పలువురు
ప్రముఖులు
ఈ
రోజు
లోక్
భవన్
లో
రాష్ట్ర
గవర్నర్
జీష్ణు
దేవ్
వర్మ
ను
కలుసుకుని
శుభాకాంక్షలు
తెలిపారు.
ఈ
సందర్భంగా
జరిగిన
ఓపెన్
హౌస్
కార్యక్రమంలో
గవర్నర్
పలు
పౌర
సంస్థలు,
వ్యక్తులు,
ప్రముఖులతో
శుభాకాంక్షలు
పంచుకున్నారు.
ముఖ్యమంత్రి
A
రేవంత్
రెడ్డి,
పలువురు
మంత్రులు,
ఉన్నతాధికారులు,
పలువూరు
ప్రముఖులు
గవర్నర్
ను
కలుసుకున్నవారిలో
ఉన్నారు.


