తెలంగాణా రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ
రాష్ట్రంలో
మరో
ఎన్నికలకు
అన్ని
ప్రధాన
పార్టీలు
సిద్ధమవుతున్నాయి.
ఫిబ్రవరి,
మార్చి
నెలలలో
మున్సిపల్
ఎన్నికలను
నిర్వహించడానికి
రంగం
సిద్ధం
చేశారు.
తెలంగాణ
మున్సిపల్
ఎన్నికల
వేడి
రాజకీయ
ముఖచిత్రాన్ని
రసవత్తరంగా
మారుస్తోంది.
ముఖ్యంగా
తెలంగాణ
రాష్ట్రంలో
అధికార
కాంగ్రెస్,
బీఆర్ఎస్,
బిజెపిల
మధ్య
త్రిముఖ
పోరు
కనిపిస్తుందని
అందరూ
భావించిన
వేళ
ఊహించని
విధంగా
జనసేన
పార్టీ
తెలంగాణ
మున్సిపల్
ఎన్నికలలోకి
ఎంట్రీ
ఇచ్చింది.


మున్సిపల్
ఎన్నికల్లో
జనసేన
పోటీ

సర్పంచ్
ఎన్నికల
విజయాల
ఉత్సాహంతో
ప్రధాన
పార్టీలు
సమరానికి
సిద్ధమవుతున్న
వేళ,
జనసేన
అధినేత
పవన్
కళ్యాణ్
కూడా
తెలంగాణ
మున్సిపల్
ఎన్నికల
పైన
ఫోకస్
చేశారు.
మున్సిపల్
ఎన్నికలలో
జనసేన
నుంచి
ఒంటరిగా
బరిలోకి
దిగుతామని
ఆయన
ప్రకటించారు.
ఇక

ప్రకటన
అన్ని
రాజకీయ
వర్గాలలో
చర్చనీయాంశంగా
మారింది.


తెలంగాణాలో
జనసేన
బలోపేతం
దిశగా
పవన్
కళ్యాణ్
అడుగులు

తెలంగాణలో
పార్టీని
క్షేత్రస్థాయి
నుంచి
బలోపేతం
చేయడం
కోసమే
జనసేన
అధినేత
పవన్
కళ్యాణ్
ని
నిర్ణయం
తీసుకున్నట్టు
భావిస్తున్నారు.
గతంలో
బీజేపీతో
పొత్తు
పెట్టుకుని
ఎన్నికలలో
పోటీ
చేసిన
జనసేన
ఈసారి
స్వతంత్రంగానే
ఎన్నికల
బరిలోకి
దిగాలని
నిర్ణయించింది.
ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
బలోపేతంగా
ఉన్నటువంటి
జనసేన
పార్టీని
తెలంగాణ
రాష్ట్రంలోని
సంస్థాగతంగా
పటిష్టం
చేయాలని
పవన్
కళ్యాణ్
భావిస్తున్నారు.


జనసేన
ఎంట్రీ

పార్టీకి
నష్టం
చేస్తుందో


క్రమంలోనే
జనసేన
బూత్
స్థాయి
కమిటీలను
ఏర్పాటు
చేస్తున్నారు.
జనవరి
10వ
తేదీన
విడుదలైన
ప్రకటనలో
ఎన్నికల
ప్రచారానికి
సిద్ధంగా
ఉండాలని
జనసైనికులకు
పార్టీ
పిలుపునిచ్చింది.

ప్రకటనతో
కార్యకర్తలలో
నూతన
ఉత్సాహం
కనిపిస్తోంది.
అయితే
జనసేన
పార్టీ
ఊహించని
విధంగా
తెలంగాణ
రాష్ట్ర
మున్సిపల్
ఎన్నికలలో
ఎంట్రీ
ఇవ్వనున్న
క్రమంలో
ఇది

పార్టీకి
నష్టం
చేస్తుంది
అనేది
ఇంకా
స్పష్టత
రావడం
లేదు.


రాష్ట్ర
రాజకీయ
సమీకరణాలపై
ప్రభావం
చూపేలా
జనసేన
స్టెప్

పార్టీ
గుర్తుపై
జరిగే
మున్సిపల్
ఎన్నికలు
ప్రతి
పార్టీకి
ఎంతో
ప్రతిష్టాత్మకం
కావడంతో
జనసేన
ఎంట్రీ
రాష్ట్ర
రాజకీయ
సమీకరణాల
పైన
గణనీయ
ప్రభావాన్ని
చూపిస్తుందని
భావిస్తున్నారు.
తెలంగాణ
రాష్ట్రంలో
పెద్దగా
యాక్టివ్
గా
లేని
జనసేన
పార్టీ
మున్సిపల్
ఎన్నికల్లో
పోటీ
చేస్తే
విజయ
అవకాశాలు
పెద్దగా,
తెలంగాణ
రాజకీయాలలో
మాత్రం
భారీగానే
ఇంపాక్ట్
చూపిస్తుందని
భావిస్తున్నారు.
అన్ని
పార్టీలను
టెన్షన్
పెడుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related