Telangana
oi-Bomma Shivakumar
సంక్రాంతి
సెలవులు
పూర్తయిన
వారం
రోజులకే
మరోసారి
సెలవులు
రానున్నాయి.
ఈ
వీకెండ్
లో
వరుసగా
మూడు
రోజులు
హాలీడేస్
వస్తున్నాయి.
సంక్రాంతి
సెలవులు
ముగిసి
తిరిగి
ఆఫీస్
బాట
పట్టిన
పెద్దలు,
స్కూళ్లకు
వెళుతున్న
పిల్లలు,
రెగ్యూలర్
వంటింటి
పనుల్లో
మునిగిన
గృహిణులు
ఈ
సెలవుల్లో
హాయిగా
టూర్
ప్లాన్
చేసుకోవచ్చు.
ఈ
క్రమంలోనే
ఈ
సెలవులను
దృష్టిలో
పెట్టుకుని
తెలంగాణ
ఆర్టీసీ
అద్భుతమైన
టూర్
ప్లాన్
ను
తీసుకొచ్చింది.
ఇంకెందుకు
ఆలస్యం..
వెంటనే
బ్యాగ్
సర్దుకుని
పుణ్యక్షేత్రాల
బాట
పట్టండి.
వరుస
సెలవులు
తెలుగు
రాష్ట్రాల్లోని
విద్యాసంస్థలకు
సంక్రాంతి
సెలవులు
పూర్తయి
జనవరి
19
నుంచి
తిరిగి
పాఠశాలలు
ప్రారంభమయ్యాయి.
అయితే
మళ్లీ
వారం
రోజుల
వ్యవధిలోనే
మళ్లీ
వరుస
సెలవులు
వచ్చాయి.
జనవరి
24
శనివారం,
జనవరి
25
ఆదివారం,
జనవరి
26
రిపబ్లిక్
డే
కారణంగా
వరుసగా
మూడు
రోజులు
సెలవులు
వచ్చాయి.
అలాగే
ఐటీ,
కార్పొరేట్
ఉద్యోగులకు
కూడా
ప్రతి
వీకెండ్
లో
శని,
ఆది
వారాలు
సెలవులే
ఉంటాయి.
ఈ
క్రమంలోనే
తెలంగాణ
ఆర్టీసీ
ప్రత్యేక
టూర్
ప్లాన్
ను
అందుబాటులోకి
తీసుకొచ్చింది.
బడ్జెట్
లోనే
లగ్జరీ
బస్సులో
ప్రముఖ
ఆధ్యాత్మిక
ప్రాంతాలను
చుట్టొచ్చే
అవకాశం
కల్పిస్తోంది.
మహారాష్ట్ర,
కర్ణాటక
ప్రాంతాల్లోని
పుణ్యకేత్రాలకు
టూర్
ప్లాన్
ప్రకటించింది
తెలంగాణ
ఆర్టీసీ.
కేవలం
రూ.
3
వేలకే
ఒకరు
1
నైట్,
2
డేస్
పర్యటించేలా
ప్లాన్
చేసింది.
ఈ
టూర్
లో
భాగంగా
పండరీ
పూర్,
గానుగాపూర్,
కొల్హాపూర్,
తుల్జాపూర్
ఆలయాలను
దర్శించుకోవచ్చు.
ఇందుకు
సంబంధించిన
బస్సు
బిహెచ్ఈఎల్
డిపో
నుండి
ప్రారంభం
అవుతుంది.
తెలంగాణ
ఆర్టీసీ
ప్రత్యేక
టూర్
ప్లాన్
ఇక
ఈ
టూర్
కు
సబంధించిన
మరిన్ని
వివరాల
కోసం
ప్రత్యేకంగా
9391072283
లేదా
9063401072
నంబర్లకు
ఫోన్
చేయవచ్చు.
మరోవైపు
ఫిబ్రవరి
సెకండ్
వీక్
లో
రెండో
శనివారం,
ఆదివారం
వరుస
సెలవులు
ఉన్న
నేపథ్యంలో..
ఫిబ్రవరి
6
నుండి
గోవా
టూర్
ను
సిద్ధం
చేసింది
తెలంగాణ
ఆర్టీసీ.
కేవలం
రూ.
3,500కే
3
నైట్స్,
4
డేస్
గోవా
టూర్
ప్యాకేజీని
అందిస్తోంది.
గోవాతో
పాటు
హంపీ,
తుల్జాపూర్
కూడా
ఈ
ప్యాకేజీలో
భాగంగా
ఉన్నాయి.


