Telangana
oi-Chandrasekhar Rao
యాదాద్రి
భువనగిరి
జిల్లా
బీబీనగర్
వద్ద
రూపుదిద్దుకుంటోన్న
అఖిల
భారత
ఇన్‌స్టిట్యూట్
ఆఫ్
మెడికల్
సైన్సెస్
(AIIMS)
ఆసుపత్రి
మెడికల్
కాలేజీ
నిర్మాణ
పనులు
దాదాపు
పూర్తి
కావచ్చాయి.
90
శాతం
వరకు
నిర్మాణాన్ని
పూర్తి
చేసుకుందీ
కాంప్లెక్స్.
ఈ
ఏడాది
జూన్
నాటికి
కార్యకలాపాలు
మొదలు
పెట్టే
అవకాశాలు
ఉన్నాయి.
పూర్తి
స్థాయిలో
దీన్ని
అందుబాటులోకి
తీసుకుని
రావడానికి
తుదిదశ
నిర్మాణ
పనులు
వేగవంతం
చేసినట్లు
కేంద్రమంత్రి
జీ
కిషన్
రెడ్డి
తెలిపారు.
ఈ
ప్రాజెక్ట్
కు
సంబంధించిన
తాజా
సమాచారం,
ఫొటోలను
ఆయన
తన
అధికారిక
ఎక్స్
అకౌంట్
లో
పోస్ట్
చేశారు.
తెలంగాణ
దశ
దిశను
మార్చివేసే
మెడికల్
హబ్
గా
ఇది
రూపుదిద్దుకుంటుందని
చెప్పారు.
రోగుల
సంరక్షణలో
దేశానికే
దిక్సూచిలా
నిలుస్తుందని
పేర్కొన్నారు.
ఇప్పటివరకు
ఇక్కడి
మెడికల్
కాలేజీలో
ఏడు
ఎంబీబీఎస్
బ్యాచ్‌లలో
609
మంది
విద్యార్థులు
చేరారు.
24
విభాగాల్లో
133
మంది
రెసిడెంట్‌లతో
పీజీ
కార్యక్రమాలు,
ఏడు
విభాగాల్లో
సూపర్
స్పెషాలిటీ
శిక్షణ
అందిస్తున్నారు.
నర్సింగ్,
అలైడ్
హెల్త్
సైన్సెస్
కోర్సులు
కూడా
అందుబాటులోకి
రానున్నాయి.
14.95
లక్షలకు
పైగా
ఓపీడీ
రోగులకు
చికిత్స
అందించగా,
20
లక్షలకు
పైగా
ల్యాబ్,
డయాగ్నస్టిక్
పరీక్షలు
నిర్వహించింది.
ప్రధాన
విద్యా,
నివాస
మౌలిక
వసతుల
నిర్మాణం
ఇప్పటికే
పూర్తి
కావడంతో
అకడమిక్
బ్లాక్,
హాస్టళ్లు,
ఆయుష్,
డైనింగ్
హాల్స్,
క్వార్టర్లు,
కమ్యూనిటీ
భవనాలు
పూర్తిస్థాయిలో
పనిచేస్తున్నాయి.
ఆసుపత్రి
విస్తరణ,
ఆడిటోరియం,
ఆపరేషన్
థియేటర్
బ్లాక్,
ఇతర
సేవా
భవనాల
పనులు
చివరి
దశలో
ఉన్నాయని,
ఈ
ఏడాది
జూన్
నాటికి
పూర్తి
అవుతాయి.
ప్రధాన
మంత్రి
స్వాస్థ్య
సురక్ష
యోజన
కింద
ఎయిమ్స్-
బీబీనగర్‌ను
రూపుదిద్దుకుంటోంది.
2022
జులైలో
ప్రారంభమైన
ఈ
ప్రాజెక్ట్
గత
ఏడాది
డిసెంబర్
1
నాటికి
86
శాతం
పూర్తయింది.
‘ప్రో-యాక్టివ్
గవర్నెన్స్
అండ్
టైమ్లీ
ఇంప్లిమెంటేషన్’
(PRAGATI)
50వ
సమావేశంలో
ప్రధాని
మోదీ
దీని
నిర్మాణ
పనులను
సమీక్షించారు.
ఎయిమ్స్
వంటి
కీలక
ప్రాజెక్టులు,
ప్రజా
ఫిర్యాదుల
రియల్
టైమ్
మేనేజ్మెంట్
కోసం
ప్రగతి
ప్లాట్
ఫామ్
ను
ప్రధాని
మోదీ
2015లో
ప్రారంభించిన
విషయం
తెలిసిందే.
ఎయిమ్స్
బీబీనగర్
ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్
డాక్టర్
అమితా
అగర్వాల్
వర్చువల్
గా
ఈ
భేటీలో
పాల్గొన్నారు.
నిర్మాణ
పురోగతిని
వివరి4ంచారు.
ఈ
ఆసుపత్రి
సుమారు
3,000
ప్రత్యక్ష
ఉద్యోగాలను
సృష్టిస్తుంది.
అలాగే
ఆరోగ్య
సంరక్షణ,
వైద్య
విద్య,
ప్రాంతీయ
ఉపాధిని
బలోపేతం
చేస్తుంది.


