తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది.

తెలంగాణా నుండి తిరుపతికి కొత్త మార్గం

తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతి వెళ్లాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ జాతీయ రహదారి దొరికినట్లు అయింది. ఈ కొత్త మార్గం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్గొండ, మాచర్ల, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు, దుత్తలూరు, రాపూరు, వెంకటగిరి, ఏర్పేడు ప్రాంతాల మీదుగా ఈ రహదారి సాగుతుంది.

ఎన్ హెచ్ 565 నిర్మాణంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

గతంలో మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుండి హైదరాబాదుకు రాత్రిపూట అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే జనాలు ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మీదుగా దారుణంగా రోడ్డు ఉండేది. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ ఎన్ హెచ్ 565 నిర్మాణం చేయడంతో ప్రస్తుతం ఆ కష్టాలు తొలగిపోయాయి. ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరంగా మారింది.

రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యంతో అడ్డంకి

NH565 లోని 20 కిలోమీటర్ల రహదారి విస్తరణకు అటవీ అనుమతుల జాప్యం వంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ పనులకు లైన్ క్లియర్ కావడంతో, వేగవంతం చేసి నిర్దేశిత సమయం కంటే ముందుగానే పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో సాగే ఈ మార్గం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయల ఖర్చు

గతంలో పుల్లలచెరువు నుండి వెల్దుర్తి మండలం వరకు ప్రయాణం చేయాలంటే 50 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లోనే ప్రయాణం సాగుతుంది. దీంతో సమయం బాగా ఆదా అవుతుంది. 20 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం కోసం 393 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అటవీ మరియు ఘాట్ ప్రాంతాలను కలుపుతూ 16 వంతెనలు, ఎనిమిది అండర్ పాస్ లు ఈ మార్గంలో ఏర్పాటయ్యాయి.

ఈ ప్రాంతాల మీదుగా రహదారి

మొత్తం 420 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేలో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ, కనగల్ ప్రాంతాల మీదుగా వచ్చి, మాచర్ల వద్ద ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపుకు వెళితే కాళహస్తి కుడివైపుకు వెళితే తిరుపతిని చేరుకునేలా ఈ మార్గం ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు తిరుపతి వెళ్లడం ఈజీ అవుతుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related