తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

తెలంగాణ కు నూతన డీజీపీ రానున్నారు. తదుపరి డీజీపీ ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి జాబితా పంపగా, అందులో సీనియర్‌ అధికారిని ఖరారు చేయనున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఇప్పటికే నూతన డీజీపీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ రోజు ఢిల్లీ సమావేశం తరువాత.. త్వరలో నే అధికారికంగా కొత్త డీజీపీ పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

తెలంగాణకు తదుపరి డీజీపీ దాదాపు ఖరారయ్యారు. యూపీఎస్సీకి పంపిన నలుగురు అధికారుల జాబితాలో సీనియర్‌గా ఉన్న 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ విషయంలో ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. డీజీపీ పోస్టు కోసం సీవీ ఆనంద్‌తో పాటు వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్‌ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ ఎంప్యానెల్‌ కమిటీ సభ్యుల భేటీ ఈ రోజు (బుధవారం) జరగనుంది. ఈ కమిటీలో రాష్ట్ర సీఎస్‌ రామకృష్ణారావు కూడా సభ్యుడు కావడంతో ఆయన ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఎస్సీ కమిటీ తమకు నాలుగు పేర్లతో అందిన జాబితాను పరిశీలించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముగ్గురి పేర్లతో డీజీపీ నియామకానికి సంబంధించి తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్ధాయి డీజీపీగా నియమిస్తుంది.

కొత్త డీజీపీ పై కసరత్తు

కాగా, ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి పదవీకాలం వచ్చే నెలాఖరున ముగియనున్న నేపధ్యంలో ఆలోపే నూతన డీజీపీ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. డీజీపీల నియామకానికి సంబంధించి ప్రకాష్‌ సింగ్‌ కేసులో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు యూపీఎస్సీ లేఖలు రాసి నియామక ప్రక్రియను గుర్తు చేయాలని, అప్పటికి ఆయా ప్రభుత్వాలు స్పందించకపోతే తమ దృష్టికి తీసుకుని రావాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, గత నెలలో యూపీఎ్‌ససీ తెలంగాణతో పాటు పది రాష్ట్రాల డీజీపీల నియామకానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. తెలంగాణకు సంబంధించి ప్రస్తుత హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్‌ (1991) 2028 జూన్‌ వరకు, ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉన్న వీపీ ఆప్టే(1994) 2029 అక్టోబర్‌ వరకు, జైళ్లశాఖ డీజీపీగా ఉన్న సౌమ్యామిశ్రా (1994) 2027 డిసెంబరు వరకు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌గా పనిచేస్తున్న శిఖాగోయల్‌(1994) 2029 మార్చి వరకు సర్వీసులో ఉంటారు. వీరిలో సీనియారిటీలో మొదటి స్ధానంలో ఉన్న సీవీ ఆనంద్‌ వైపు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related